వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘మహావీరుడు’ టైటిల్ పోస్టర్, యాక్షన్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ గానగాన పాటని విడుదల చేసి ‘మహావీరుడు’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా ప్రారంభించారు.
సంగీత దర్శకుడు భరత్ శంకర్ ‘గాన గాన’ పాటని మాస్ ఆకట్టుకునే ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. యాజిన్ నిజార్ ఎనర్జిటిక్ గా పాడగా, గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో శివ కార్తికేయన్ చేసిన మాస్ మూమెంట్స్ అందరినీ అలరించాయి.
ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా , కుమార్ గంగప్పన్, అరుణ్ ఆర్ట్ డైరెక్టర్స్ గా పని చేస్తున్నారు.
తారాగణం: శివ కార్తికేయన్, అదితి శంకర్
దర్శకత్వం: మడోన్ అశ్విన్
నిర్మాత: అరుణ్ విశ్వ
బ్యానర్ : శాంతి టాకీస్
సంగీతం: భరత్ శంకర్
డీవోపీ : విధు అయ్యన్న
ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ – కుమార్ గంగప్పన్, అరుణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…