రానాతో కలసి ‘కాంత’ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో దుల్కర్ సల్మాన్

రానాతో కలసి ‘కాంత’ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడండి. ఎందుకంటే ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో దుల్కర్ సల్మాన్

-దుల్కర్ రెట్రో కింగ్. ఈ సినిమా తర్వాత తనని అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు: హీరో రానా దగ్గుబాటి

-రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ‘కాంత’ ఇంటెన్స్ ట్రైలర్‌

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ రిలీజ్ తో ఇప్పుడు ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది. రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో అదిరిపోయింది.

ఒక రైజింగ్ స్టార్, అతనికి దారి చూపిన గురువు మధ్య ఉన్న ఎమిషన్ ని ట్రైలర్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది. ఈ ఇద్దరి డ్రీం ప్రాజెక్ట్ ‘శాంత’ దగ్గరకి వచ్చేసరికి ఇగో వార్ గా మారుతుంది. స్నేహం, ఆశయాల మధ్య నడిచే ఈ సంఘర్షణ ‘కాంత’ కథపై మరింత ఆసక్తిని పెంచింది.

దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్‌ ఈ కథను ఎమోషన్స్ హార్ట్ టచ్చింగ్ డ్రామాటిక్‌ సన్నివేశాలతో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ క్రియేటివ్ విజన్ కనిపించింది.

దుల్కర్‌ సల్మాన్‌ తన అద్భుతమైన నటనతో వెర్సటిలిటీని నిరూపించాడు. గుర్తింపు కోసం ఆత్రుతగా ఉన్న కొత్త నటుడి నుంచి, స్టార్ డమ్ కు చేరిన తర్వాత ఈగోని ప్రదర్శించే స్టార్‌గా అతని ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయింది. సముద్రఖని సహజమైన నటనతో గురువు పాత్రలో ఆకట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్స్‌ కథకు ప్రాణం పోసే పాత్రలో కనిపించారు. రానా దగ్గుబాటి పోలీస్‌ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇవ్వడం కథలో కొత్త టెన్షన్‌, బలాన్ని తెచ్చింది.

డానీ సాంచెజ్‌ లోపెజ్‌ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో హైలెట్. మోనోక్రోమ్‌ టోన్‌లో చూపించిన పీరియడ్‌ సెట్టింగ్‌ అద్భుతంగా కనిపిస్తుంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ రామలింగం రూపొందించిన సెట్లు క్లాసిక్‌ సినిమాల యుగానికి మళ్లీ సజీవం పోశాయి. జాను చాంతర్‌ సంగీతం ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది

దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఆకట్టుకున్న ‘కాంత’ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడండి. ఎందుకంటే ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది మాకు చాలా స్పెషల్ సినిమా. నా బెస్ట్ ఫ్రెండ్ రానా తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను వాళ్ళింట్లో అబ్బాయిలానే ఉంటాను. మేమిద్దరం కలసి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. సెల్వ అద్భుతమైన కథతో వచ్చాడు. సముద్రఖని గారితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇందులో ఆయన మెమొరబుల్ పెర్ఫార్మన్స్ చూస్తారు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ గారు చాలా డిఫరెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇందులో అద్భుతమైన మ్యూజిక్ వుంది. ఇది మంచి డ్రామా, థ్రిల్లర్. డెఫినెట్ గా థియేటర్స్ లో చూడండి. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.

హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. అందరికీ హాయ్. కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ స్టూడియోస్ లేవు. అందరూ విజయ స్టూడియో, వాహిని స్టూడియో, ఏవీఎన్ స్టూడియోలలో జరిగే మాట్లాడుకునే వాళ్ళు, స్టార్స్ గురించి చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది. అప్పుడు స్టూడియోలో జరిగే విషయాలు చాలా తక్కువ మందికి తెలిసేది. అలాంటి ఒక్క బ్యాక్ డ్రాప్ లో సెల్వ కథ చెప్పడం జరిగింది. కథ విన్న వెంటనే కచ్చితంగా ఈ సినిమా చేయాలనిపించింది. ఇలాంటి పీరియడ్ సినిమాకి దుల్కర్ సల్మాన్ లాంటి రెట్రో కింగ్ పర్ఫెక్ట్. నవంబర్ 14 తర్వాత దుల్కర్ ని మీరు అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు. భీమ్లా నాయక్ లో సముద్రఖని గారి అబ్బాయిగా చేశాను. ఇందులో మా రిలేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దుల్కర్, సముద్రఖని లాంటి అద్భుత నటుల మధ్య నిల్చుంది భాగ్యశ్రీ. నవంబర్ 14న మీ అందరినీ థియేటర్స్ లో కలుస్తున్నాం. థాంక్యూ.

భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అందరినీ నమస్కారం. ఇప్పటివరకు నా సినిమాలు చూశారు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం చూస్తారు. కాంత నాకు చాలా చాలా స్పెషల్. మీ అందరి ప్రేమకు థాంక్ యూ. ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

సముద్రఖని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కాంత సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉంది. ఇది చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సినిమా. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మంచి ఇంటెన్స్ పెర్ఫార్మ్ చేసే అవకాశం దొరికింది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థాంక్యూ. నట చక్రవర్తి దుల్కర్ సల్మాన్ , రానా గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు

డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. గత ఏడాదిగా రామానాయుడు స్టూడియో నా హోమ్ గా మారింది. సినిమా మొత్తం హైదరాబాద్ లో షూట్ చేశాం. తెలుగు ప్రేక్షకుల నుంచి మాకు ఎంతో ప్రేమ దొరికింది. నవంబర్ 14న మీ అందరితో కలిసి సినిమా చూడాలని ఉంది. ఇందులో మీరందరూ కూడా గ్రేట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. నటచక్రవర్తి దుల్కర్ సల్మాన్ గారి పెర్ఫార్మన్స్ ని మీ అందరూ చాలా ఇష్టపడతారు. రాణా గారి పర్ఫార్మెన్స్ మీ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. భాగ్యశ్రీ గారు సముద్రఖని గారు అందరు అద్భుతంగా నటించారు నవంబర్ 14న థియేటర్స్ లో కలుద్దాం.

ప్రొడ్యూసర్ ప్రశాంత్ పొట్లూరి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ సినిమాని కష్టపడి ప్రాణం పోసి నవంబర్ 14న మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నాం. సినిమా ఫెంటాస్టిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. ఇందులో ప్రతి యాక్టర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమాకి ట్రిబ్యూట్ లాగా ఈ సినిమా చేశాం. ప్రతి ఫ్రేమ్ లో ఇంటెన్సిటీ పెర్ఫార్మన్స్ థ్రిల్లు ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటాయి. ఇందులో రానా గారు సర్ప్రైజ్ ప్యాకేజ్. సముద్రఖని గారు అద్భుతంగా నటించారు. ఇందులో దుల్కర్ గారి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన్ని నటచక్రవర్తి అని పిలుస్తారు. నవంబర్ 14న కాంత చూడండి. మీ అభిమానానికి థాంక్యూ.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago