Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

‘స్పై’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అక్కినేని నాగ చైతన్య

Must Read

నిఖిల్ ‘స్పై’తో కార్తికేయ2 ని దాటి నెక్స్ట్ లెవల్ ట్రెండ్ సెట్ చేస్తారు

‘స్పై’ ప్రతి ఇండియన్ తప్పకుండా చూడాల్సిన సినిమా: హీరో నిఖిల్      

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ.. నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. హ్యాపీ డేస్ లో పక్కింటి కుర్రాడి పాత్రతో మొదలుపెట్టి స్వామిరారా, కార్తికేయ తో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసి కార్తికేయ2 తో బాక్సాఫీసుని షేక్ చేశాడు. ఇప్పుడు స్పై తో ముందుకు రాబోతున్నాడు. తన జర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. స్పై జోనర్ సినిమాలు చేయడం అంత తేలిక కాదు. ఓటీటీ లో ప్రేక్షకులు వరల్డ్ కంటెంట్ ని చూస్తున్నారు,. ఐతే స్పై ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంటర్ నేషనల్ గా అనిపించింది. ఆజాదీ పాట కూడా చాలా నచ్చింది. నిర్మాతలకు అభినందనలు. టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ఐశ్వర్య, సాన్య వెల్ కం టు టాలీవుడ్. ఆర్యన్ రాజేష్, జిషు, అభినవ్ అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడి  గా  పరిచయం అవుతున్న గారీకి ఆల్ ది బెస్ట్. ఆయన  నుంచి మరిన్ని సినిమాలు రావాలి. నిఖిల్ కార్తికేయ 2తో ఒక ట్రెండ్ సెట్ చేశారు.స్పై తో ఆ ట్రెండ్ ని దాటి నెక్స్ట్ లెవల్ కి వెళ్తారని నమ్ముతున్నాను. 29న ‘స్పై’ ని థియేటర్ లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘స్పై’ సినిమా చేయడానికి కారణం నిర్మాత రాజశేఖర్ గారు. కథ విన్న తర్వాత మరో ఆలోచన లేకుండా ఈ కథని ఎంత గ్రాండ్ గా తీద్దామనేదానిపై ద్రుష్టి పెట్టాం. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కార్తికేయ 2 ఇంకా రాలేదు. నన్ను ముందే నమ్మిన రాజన్న, తేజ్ లకు కృతజ్ఞతలు. ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా సినిమా తీశారు. ‘స్పై’ చాలా మంచి సినిమా. ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్, సెకండ్ హాఫ్ గూస్ బంప్స్. నేతాజీ జీవితం చుట్టూ తిరిగే సినిమా ఇది. ఆయన పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి.  నాలుగు రోజుల క్రితమే మళ్ళీ సినిమా చూశాను. గారీ ని హాగ్ చేసుకొని థాంక్స్ చెప్పాను. అంత అద్భుతంగా తీశాడు. ఈ సినిమా పోస్టర్ టీజర్ ట్రైలర్ అన్నిటికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మీరు ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మా కంటెంట్ అంతకంటే బావుంటుంది. మీరు అనుకున్నదాని కంటే గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం. ఇది వాస్తవం. చాలా మంచి సినిమా తీశాం. గర్వపడే సినిమా చేశాం. రాజేష్ భాయ్, జిషు, నితిన్  గారు అందరూ అద్భుతంగా చేశారు. అభినవ్ పాత్ర చాలా కీలకంగా వుంటుంది. ఐశ్వర్య, సాన్య చాలా బ్యూటిఫుల్ గా యాక్ట్  చేశారు. నాగచైతన్య గారు ఈవెంట్ కి రావడం చాలా అనందంగా వుంది. ఈవెంట్ కి  వచ్చి మాకు ధైర్యం ఇచ్చారు. ఆయన రాకతో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. చైతు గారికి కృతజ్ఞతలు. జూన్ 29న థియేటర్ లో మిస్ కావద్దు. స్పై ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా . ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా. పేరెంట్స్ పిల్లలకి చూపించాల్సిన సినిమా . స్పై నాకు మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. 29న థియేటర్స్ లో కలుద్దాం. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు  

నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నాగచైతన్య గారికి కృతజ్ఞతలు. నిఖిల్ నాకు బ్రదర్ లాంటి వారు. నటుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. తను చాలా పెర్ ఫెక్షనిస్ట్. ప్రతి విషయంపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఐశ్వర్య, సన్యా ఇద్దరూ చక్కగా నటించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. శ్రీచరణ్ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. వంశీ చాలా బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. దర్శకుడు గ్యారీ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ కథ నేను ఊహించిన దాని కంటే అద్భుతంగా వచ్చింది.  ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.

దర్శకుడు గ్యారీ బిహెచ్ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ముందుకు మా అమ్మానాన్నలకు కృతజ్ఞతలు. వారి వలనే ఈ ప్రయాణం సాధ్యమైయింది. నిర్మాతలు నాపై చాలా నమ్మకం ఉంచారు. రెండేళ్ళ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది చాలా బ్యూటీఫుల్ జర్నీ. నిఖిల్  భాయ్ నన్ను నమ్మారు. ఆయనకి స్పెషల్ థాంక్స్. శ్రీ చరణ్ అద్భుతమైన నేపధ్య సంగీతం ఇచ్చారు. వంశీ బ్రిలియంట్  విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇంత త్వరగా సినిమాని డెలివర్ చేయగలిగామంటే దానికి కారణం మా డైరెక్షన్ టీం. సినిమా కోసం రాత్రిపగలు కష్టపడ్డాం. జూన్ 29న సినిమా విదుదలౌతుంది. అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి’’ అని కోరారు.

కార్తిక్ దండు మాట్లాడుతూ.. నా కెరీర్ నిఖిల్ తోనే మొదలైయింది. కార్తికేయ మూవీ కలసి చేశాం. నేతాజీ జీవితానికి సంబధించిన రహస్యాలు తెలుకోవాలని అందరికీ వుంటుంది. అలాంటి కథ చేసిన రాజశేఖర్ గారికి ఆల్ ది బెస్ట్. టీం అందరికీ బెస్ట్ విషెస్. నాగచైతన్య గారితో ఈ వేదిక పంచుకోవడం అనందంగా వుంది’’ అన్నారు  

జిష్షు సేన్ గుప్తా మాట్లాడుతూ.. నన్ను ఆదరించిన తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నిఖిల్ కి అభినందనలు. డబ్బింగ్ చేసినప్పుడు చూశాను. సినిమా అద్భుతంగా వుంది. చాలా పెద్ద విజయం సాధిస్తుంది

ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ.. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు గ్యారీకి థాంక్స్. చరణ్, రాజశేఖర్ గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. నిఖిల్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి’’ అని కోరారు.

ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మొదటి సినిమా. నాగచైతన్య గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. గ్యారీ గారి వలనే ఈ సినిమా అవకాశం వచ్చింది. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా తీశారు. నిఖిల్ గారితో నా తెలుగు డెబ్యు చేయడం ఆనందంగా వుంది. నిఖిల్ గారు బ్రిలుయంట్  యాక్టర్. సినిమాలో పని చేసిన అందరినీ కృతజ్ఞతలు’’ తెలిపారు

సన్యా ఠాకూర్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి తెలుగు ఈవెంట్ చాలా అనందంగా వుంది. నిఖిల్ గారు వండర్ ఫుల్ కో స్టార్. దర్శక నిర్మాతలకు  కృతజ్ఞతలు. గ్యారీ చాలా హార్డ్ వర్క్ చేశారు. వంశీ అమెజింగ్ విజువల్స్ ఇచ్చారు. స్పై మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు

శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నిఖిల్ సినిమాకి మ్యూజిక్ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాకి డిఫరెంట్ మ్యూజిక్ చేశాం. ఆజాదీ పాట చేయడం ఆనందాన్ని ఇచ్చింది. నా మ్యూజిక్ టీం అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు

డీవోపీ వంశీ పచ్చిపులుసు మాట్లాడుతూ…  నా కోర్ టీంకి కృతజ్ఞతలు. పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా హెల్ప్ చేశారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వారికి కృతజ్ఞతలు. నిఖిల్ గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్’’ అన్నారు. ఈ వేడుకలో నితిన్ మెహతా, రవి వర్మతో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.

Latest News

“Heart Filled with Gratitude”: Megastar Chiranjeevi Reacts on Prestigious Honour at the House of Commons in the United Kingdom

Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown… after being honoured by...

More News