అంతర్జాతీయ అవార్డులు అందుకున్న “హ్యాట్సాఫ్ పోలీస్”

Must Read

-*హ్యాట్సాఫ్ పోలీస్ చిత్రానికి అవార్డుల పరంపర కొనసాగుతుంది, 9వ తేది ఆదివారం హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో ఇంటర్నేషనల్ మెగా ఫిల్మ్ ఫెస్టివల్ 2025 కార్యక్రమంలో ఉత్తమ నటుడు అవార్డును ప్రముఖ సినీ దర్శకులు, చిత్ర కథానాయకుడు రెడ్డెం యాదకుమార్ మరియు ఉత్తమ చిత్రం అవార్డును చిత్ర రచయిత, దర్శకులు జీ.వి. త్రినాధ్ లు ముఖ్య అతిథి ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ఇండియన్ పొలిటీషియన్ వేణుగోపాలా చారి,
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్, సినీ నటులు పుష్ప మహేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

అవార్డుల ప్రధానం అనంతరం అతిధులు మాట్లాడుతూ రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం అభినందనీయం అని మరిన్ని సమాజ హిత చిత్రాలు వీరి ద్వారా నిర్మితం అవ్వాలని, చిత్ర నిర్మాతలు పైడి శంకరరావు, కోరుకొండ లీలాకుమారి లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న రెడ్డం యాదకుమార్ మాట్లాడుతూ.. ఈ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉందని, ఎంపిక చేసిన జ్యూరీ కమిటీకి కృతజ్ఞతలు అన్నారు. త్వరలో యాదకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “కంచర్ల” చిత్రం విడుదలకు సిద్ధమైంది. నటుడిగా, దర్శకుడిగా ఇలాంటి పురస్కారాలు ఎన్నో అందుకోవాలని కోరుకుందాం.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News