‘హత్య’ ఫస్ట్ లుక్ విడుదల

మహాకాళ్ పిక్చర్స్‌పై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ తెరకెక్కిస్తున్న ‘హత్య’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్యా బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో రానున్నారు. ఈ సినిమాను మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సోమవారం నాడు ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవి వర్మ కనిపిస్తున్న తీరు.. రక్తంతో కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ థ్రిల్లర్ మూవీ రాబోతోన్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతోంది.

ఈ చిత్రానికి అభిరాజ్ రాజేంద్రన్ నాయర్ సినిమాటోగ్రఫర్‌గా, నరేష్ కుమారన్ పి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఈ చిత్రానికి ఎడిటర్‌గా, ఎస్‌ ప్రశాంత్‌ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్లు ఇవ్వనున్నట్టుగా టీం ప్రకటించింది.

నటీనటులు : ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: శ్రీ విద్యా బసవా
నిర్మాత: ఎస్ ప్రశాంత్ రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అభిరాజ్ రాజేంద్రన్ నాయర్
సంగీత దర్శకుడు: నరేష్ కుమారన్ పి
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ శ్రీకాంత్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: ఎస్ ప్రశాంత్ రెడ్డి
సౌండ్ డిజైన్: సింక్ సినిమా- సచిన్ సుధాకరన్, హరిహరన్
సౌండ్ మిక్స్: అరవింద్ మీనన్

Tfja Team

Recent Posts

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

2 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

2 days ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

1 week ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 weeks ago