‘హరోం హర’ ఉడిపి షెడ్యూల్ ప్రారంభం

సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్ఎస్ సి పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’ ఉడిపి షెడ్యూల్ ప్రారంభం  

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘ది రివోల్ట్’ అనేది సినిమా ట్యాగ్‌ లైన్. సుధీర్ బాబు బర్త్ డే కానుకగా విడుదలైన ‘హరోం హర’ ఫస్ట్ ట్రిగ్గర్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ తాజాగా ఉడిపిలో ప్రారంభమైయింది. 30 రోజుల పాటు జరిగే ఈ లాంగ్ షెడ్యూల్ లో ఉడిపి పరిసరాల్లో చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా పని చేస్తున్నారు .

ఈ ఏడాది డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: సుధీర్ బాబు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్ ద్వారక
బ్యానర్ – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత – సుమంత్ జి నాయుడు
సంగీతం – చైతన్ భరద్వాజ్
డీవోపీ – అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ – రవితేజ గిరిజాల
పీఆర్వో – వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 hour ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago