ఓ భామ అయ్యో రామ’ చిత్రంతో అతిథి పాత్రలో మెరవనున్న దర్శకుడు హరీష్‌ శంకర్‌

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు సుహాస్ , మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తూ అందరిని అలరించడానికి సిద్ధమయ్యాడు హీరో సుహాస్‌ ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది.

ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు,వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ మాస్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.

సినిమాలో ఆయన గెస్ట్‌ రోల్‌ అందరిని సర్‌ఫ్రైజ్‌ చేస్తుంది. ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించిన మేకర్స్‌ హరీష్‌ శంకర్‌ను ఒప్పించి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేశారు. నిర్మాత మాట్లాడుతూ ” సుహాస్‌ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రంగా ఇది ఉంటుంది.

ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఓ బెస్ట్‌ క్వాలిటీ సినిమాను అందించబోతున్నాం. ఈ చిత్రంలో సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్‌ ఉంటుంది. ఈ చిత్రంలోని వినోదం ఆడియన్స్‌ను ఎంతో ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం వుంది. హరీష్‌ శంకర్‌ గారు అడ్గగానే మా చిత్రంలో అతిథి పాత్రను చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. ఈ వేసవిలో ఓ భామ అయ్యో రామ బెస్ట్‌ ఎంటర్ టైనర్‌ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
అంతేకాకుండా, కథలో మరిన్ని అంశాలను అందించేందుకు సీనియర్ నటి అనితా హసనందిని మరియు ప్రముఖ నటుడు అలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోంది – మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భవిన్ షా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2025 వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు:
సుహాస్, మాళవిక మనోజ్, అనితా హసనందిని, అలి, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్

సాంకేతిక నిపుణులు:
రచయిత-దర్శకుడు: రామ్ గోధల
నిర్మాత: హరీష్ నల్ల
బ్యానర్: V ఆర్ట్స్
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: మనికందన్ S
ఎడిటింగ్: భవిన్ షా
ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్స్: అశ్వంత్ & ప్రతిభ
PRO: ఏలూరు శ్రీను – మడూరి మధు

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

13 hours ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

13 hours ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

13 hours ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

13 hours ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

13 hours ago