యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీఎండింగ్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా
నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ.. ” ఇక్కడికి వచ్చిన గెస్ట్ లందరికీ థ్యాంక్యూ. మా బ్యానర్ లో సినిమాలు చేస్తూనే.. కొత్తగా వచ్చే నిర్మాతలకు ఆర్టిస్టులకు ఒక బ్రిడ్జ్ గా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక సినిమా విషయానికి వస్తే.. మూడేళ్ల క్రితం దర్శకుడు కౌశిక్ మా దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతను మా దగ్గరే ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆ టైమ్ లోనే యశ్ కూడా కలిశాడు. తర్వాత కౌశిక్ చెప్పిన ఓ లైన్ నచ్చి మళ్లీ పిలిపించాం. ఆ లైన్ నుంచి స్టార్ట్ అయిన సినిమానే ఈ హ్యాపీ ఎండింగ్. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు .
డివోపి అశోక్ మాట్లాడుతూ.. ”ఈ స్క్రిప్ట్ వినడానికి కౌశిక్ దగ్గరకు వెళ్లినప్పుడు అతను ఇది శాపాల గురించిన కథ అన్నాడు. అప్పుడు శాపాల మీద సినిమా ఏంటా అనుకున్నారు. బట్ నాకు తెలియని కొత్త కొత్త శాపాల గురించి చెప్పాడు. అందులోని ఒక శాపంకు సంబంధించిన కథే మన సినిమా అన్నాడు. అలాంటి ఒక శాపం ఇప్పుడున్న జెనరేషన్ లోని ఒక అబ్బాయి మీద పడితే అతని పరిస్థితేంటీ అనేదే సినిమా. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను.నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన కౌశిక్, నిర్మాతలకు థ్యాంక్యూ.” అన్నారు.
దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. ”ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్యూ చెబుతున్నాను. వాళ్లు నన్ను బాగా నమ్మారు. ఇక నా టీమ్ చాలా సపోర్టింగ్ గా ఉంది. సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మ్యూజిక్ పరంగా చాలా జానర్స్ ను టచ్ చేసినట్టు కనిపించినా.. చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నాను.. థ్యాంక్యూ” అన్నారు.
యాక్టర్ విష్ణు మాట్లాడుతూ.. ” టీజర్ లో కనిపించిన పిల్లలు.. నేను డైరెక్టర్ కౌశిక్ అనుకోవచ్చు. మేం కూడా స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమా చేశాం. ఇది ఒక విచిత్రమైన సినిమా. నా పాత్ర కూడా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్యూ చెబుతూ.. సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.
నటుడు కార్తీక్ రత్నం మాట్లాడుతూ.. ” సిల్లీమాంక్స్ నుంచి ఇలాంటి కంటెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. టీజర్ చిన్నగా ఉన్నా చాలా బావుంది. చూస్తుంటే చాలా మజా వచ్చింది. రవి గారి వర్క్ నాకు బాగా నచ్చుతుంది. నా అభిమాన నటుడు రోషన్ ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. యశ్ కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. వేదిక మీద అందరినీ కలవడం సంతోషంగా ఉంది..” అన్నారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. ” సిల్లీమాంక్స్ నాకు ఫస్ట్ గుర్తింపు తెచ్చిన జార్జ్ రెడ్డితో అసోసియేట్ అయి ఉన్న సినిమా. అందుకే నాకు ఈ బ్యానర్ స్పెషల్. టీజర్ చూడగానే చాలా హ్యాపీగా ఉంది. టీజర్ లో ఉన్న చిన్న కుర్రాడిని నేనే ట్రెయిన్ చేశానని గర్వంగా చెబుతాను. హ్యాపీ ఎండింగ్ టీమ్ కు డబ్బులు బాగా రావాలని.. అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను..” అన్నారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ .. “ఇక్కడికి పిలిచినందుకు హ్యాపీ. సిల్లీమాంక్స్ అనేది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేయడానికి కారణం సిల్లీమాంక్స్. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో మా లాంటి వాళ్లు హీరోలుగా చేయడం చాలా టఫ్. బట్ సిల్లీమాంక్స్ లాంటి బ్యానర్స్ ఉంటే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ హ్యాపీ ఎండింగ్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ హ్యాపీ ఎండింగ్ సినిమాకు శుభం జరగాలని కోరుకుంటున్నాను..”అన్నారు.
హీరోయిన్ అపూర్వ రావు మాట్లాడుతూ .. ” ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఇది నా డెబ్యూ ఫిల్మ్. కొత్తగా వచ్చే మాలాంటి వారికి మీడియా ఇంత సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్యూ. నేను ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్ లో పెరిగాను. స్టడీస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. చాలామంచి ప్యాసినేట్ మూవీ టీమ్ తో పనిచేశాను. డైరక్టర్ కౌశిక్ కల్ట్ ఫిల్మ్ మేకర్ అవుతాడు. ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెబుతున్నాను.. ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.. “అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ” కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ కు బ్రిడ్జ్ గా పనిచేస్తాం అని అనిల్ చెప్పాడు అది చాలా బావుంది. కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఇప్పుడు అవసరం. పెద్ద బ్యానర్స్ కూడా ఉన్నా.. న్యూ కమర్స్ కు కష్టంగానే ఉంది. అలాంటి వారికి సపోర్ట్ చేస్తాం అంటోన్న సిల్లీ మాంక్స్ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్నవాళ్లలో ఎవరూ పెద్దగా నాకు తెలియదు. ఇలాంటి వారిని సిల్లీమాంక్స్ ఎంకరేజ్ చేస్తోంది. వీళ్లందరికీ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఎండింగ్ మూవీ టీమ్ కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను..” అన్నారు.
దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ.. ” టీజర్ చూశాను. కానీ టీజర్ లా లేదు. అలాగని నెగెటివ్ ఏం లేదు. నేను అనిల్ కోసం వచ్చాను. ఆయనతో నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. ఈ బ్యానర్ లో మరో రెండు సినిమాలు చేయబోతున్నాను. అనిల్ గారి టేస్ట్ ఏంటో నాకు తెలుసు. ఈ సినిమా ఖచ్చితంగా బావుంటుందని నమ్ముతున్నాను. మంచి సినిమాలకు మీడియా సపోర్ట్ ఇంకా పెరగాలని ఆశిస్తూ.. బెస్ట్ ఆఫ్ లక్ టు ఎంటైర్ టీమ్ “అన్నారు.
చిత్ర దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. ” ఇక్కడికి వచ్చి గెస్ట్ లందరికీ థ్యాంక్యూ సో మచ్. సినిమాను కావాలనే షార్ట్ గా కట్ చేశాం. ఏ మాత్రం లెంగ్త్ పెంచినా కంటెంట్ లీక్ అవుతుంది. అందుకే హీరోయిన్ ను కూడా చూపించలేదీ టీజర్ లో. అయితే ఈ టైటిల్ వినగానే చాలా ఊహించుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ కథను మూడేళ్ల క్రితం అనిల్ గారికి చెప్పాను. అప్పుడే ఆయన చాలా నవ్వుకున్నారు. ఆయనే ప్రొడ్యూస్ చేస్తే బావుంటుందనుకున్నాను. చివరికి ఆయనే చేస్తుండటం హ్యాపీగా ఉంది. సినిమాకు సంబంధించి టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఎప్పటికీ మరవలేను. ఇక రైటర్ మ్యాజిక్ ఏంటనేది.. సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా హీరో యశ్ గురించి చెప్పాలి. యశ్ ఖచ్చితంగా ఓ ప్రామిసింగ్ యాక్టర్ గా ఎదుగుతాడు. హీరోయిన్ పాత్ర సినిమా అంతా ఉంటుంది. తన పాత్ర మీ అందరికీ నచ్చుతుంది.. “అన్నారు.
హీరో యశ్ మాట్లాడుతూ.. ” నాకు ముందు నుంచీ సపోర్ట్ గా ఉన్న అందరికీ థ్యాంక్యూ. ఇక్కడున్న మా అందరికీ ఒకటే లవర్. అదే సినిమా. ఈ ప్రేమవల్లే తెలుగు ఆడియన్స్ ఇంత సక్సెస్ ఇస్తున్నారు. వారి ప్రేమ వల్లే.. టాలీవుడ్ బెస్ట్ ఇండస్ట్రీ అయింది. ఇది నాకు మూడో సినిమా. సినిమా మీద ప్రేమతోనే ఈ హ్యాపీ ఎండింగ్ తీశాం. హ్యాపీ ఎండింగ్ అనేది కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అంటే పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఒక పాత్రలాగే ఉన్నారు. ఇది ది బెస్ట్ టీమ్ అని చెబుతాను. వీరిని తెలుగు సినిమా భవిష్యత్ అని కూడా చెప్పొచ్చు. మా టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్యూ సో మచ్.. ” అన్నారు.
షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే సెన్సార్ కు వెళ్లబోతోన్న ఈ
హ్యాపీ ఎండింగ్ మూవీలో
తారాగణం
యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష రోషన్, జియా శర్మ, వంశీ నెక్కంటి, KLK మణి, కమల్ తుము, శ్వేత తదితరులు..
సాంకేతిక నిపుణులు
సంగీతం : రవి నిడమర్తి
డివోపి : అశోక్ సీపల్లి
ఎడిటర్ : ప్రదీప్ ఆర్ మోరం
స్క్రీన్ ప్లే రైటర్ : నాగ సాయి
పిఆర్వో : జీ యస్ కే మీడియా
ప్రొడక్షన్ డిజైనర్ : అరవింద్ మ్యూల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రామానుజం
బ్యానర్స్ : సిల్లీ మాంక్స్ స్టూడియోస్ & హామ్స్ టెక్ ఫిల్మ్స్
దర్శకత్వం : కౌశిక్ భీమిడి
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…