సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ‘అజాగ్రత్త’

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు నార్త్‌లో ఎంత పేరు వచ్చిందో.. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పడేకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన నటనతో అందరినీ మెప్పించారు. అజాగ్రత్త సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ టైటిల్‌ చూస్తుంటే ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

రాధిక కుమారస్వామి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నేడు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం క్లాప్ కొట్టగా..నిర్మాత ఠాగూర్ మధు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ అజాగ్రత్త సినిమాలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. రావు రమేష్‌, సునీల్, ఆదిత్య మీనన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్‌గా, శ్రీహరి సంగీత దర్శకుడిగా, రవి వర్మ ఫైట్ మాస్టర్‌గా వ్యవహరించనున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత రవి రాజ్ మాట్లాడుతూ..
‘అన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. అందరూ మా సినిమాను ఆశీర్వదించండి’ అని కోరారు.

దర్శకుడు ఎం శశిధర్ మాట్లాడుతూ..
‘ఈ సినిమాను ఏడు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇలాంటి మంచి ప్రొడక్షన్ కంపెనీలో చాన్స్ దొరకడం, రాధిక మేడం అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమ, ఆదరాభిమానాలు మా టీం మీద చూపించండి’ అని కోరారు.

విలన్ శ్రవణ్ మాట్లాడుతూ..
‘శ్రేయాస్ తల్పడే గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. శశి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. టైటిల్ విన్నప్పుడే కథ నచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన రవి గారికి థాంక్స్’ అని అన్నారు.

ఆదిత్య మీనన్ మాట్లాడుతూ..
‘రవి గారు మంచి నిర్మాత. శశి గారు కథను చెప్పినప్పుడే ఈ సినిమా నచ్చింది. ఏడు భాషల్లో ఈ సినిమాను చేయబోతున్నాం. మంచి సినిమాను తీయబోతున్నాం. శ్రవణ్, రావు రమేష్‌ ఇలా తెలుగు నుంచి చాలా మంది నటిస్తున్నామ’ని అన్నారు.

రాధిక కుమారస్వామి మాట్లాడుతూ..
‘ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉండాల్సింది. కానీ నేను హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాను అని అనుకోలేదు. ఎవరూ సెట్ అవ్వడం లేదని దర్శకుడు కంగారు పడుతూ ఉన్నారు. నా డేట్స్ కావాలా? అని అడిగాను. కథ చెప్పమని అడిగాను. స్క్రిప్ట్ విన్నాక షాక్ అయ్యాను. చాలా ఏళ్ల తరువాత ఇలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య నిర్మాతకు, డైరెక్టర్ శశికి థాంక్స్. శ్రేయాస్ ఇది వరకు నటించిన సినిమాలు చూశాను. ఆయన ఎంతో బాగా నవ్విస్తారు. ఈ సినిమాతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ..
‘అందరికీ నమస్కారం. అజాగ్రత్త టీంకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రెండు పదాలే నేర్చుకున్నాను. త్వరలో తెలుగు నేర్చుకుంటాను. ఈ టీంతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కరోనా టైంలో ఇండస్ట్రీ ఎంతో మారిపోయింది’ అని అన్నారు.

నటీనటులు : శ్రేయాస్ తల్పడే, రాధిక కుమారస్వామి, రావు రమేష్‌, సునీల్, ఆదిత్య మీనన్, రాఘవేంద్ర శ్రవణ్, జయ్ ప్రకాష్‌, వినయ ప్రసాద్, దేవ్ రాజ్ తదితరులు

సాంకేతిక బృందం

దర్శకుడు : ఎం శశిధర్
నిర్మాత : రవి రాజ్
కెమెరామెన్ : సందీప్ వల్లూరి
సంగీతం : శ్రీహరి
ఫైట్ మాస్టర్ : రవి వర్మ
సహ నిర్మాత : యాదవ్
పీఆర్వో : సాయి సతీష్‌, పర్వతనేని రాంబాబు

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago