డాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌ఆయేషాఖాన్ జంటగా, హను
మేన్ చిత్రంతో పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో మణీంద్రన్ దర్శకత్వంలో డా॥ లివింగ్‌స్టన్ నిర్మిస్తున్న రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్, ఎంటర్‌టైనర్ ‘గుట్టు చప్పుడు’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ నటులు బ్రహ్మాజీ తన చేతుల మీదుగా విడుదల చేశారు.
అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ…
టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్‌ను సాయి దుర్గాతేజ్ ఆన్‌లైన్‌లోను, నేను ఆఫ్‌లైన్‌లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్‌ను కుదిరారు. భారీ బడ్జెట్‌తో తీశారు. దర్శకుడు కూడా తీసిన కంటెంట్‌ను మళ్లీ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ సినిమా చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిరది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్ ఇవ్వలేదు అని నవ్వుతూ అన్నారు.
నిర్మాత లివింగ్‌స్టన్ మాట్లాడుతూ…
డైరెక్టర్ మణీంద్రన్ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌తోనే చేయాలని ముందే డిసైడ్ అయ్యాము. అందుకే పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగీత దర్శకులు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్‌ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్, రొమాంటిక్‌తో పాటు మంచి మెసేజ్‌తో కూడిన సినిమా. హీరో సంజయ్ రెండు రకాల షేడ్స్‌ను అద్భుతంగా చేశారు. టీజర్‌లో మీరు చూసింది కొద్దిగానే. సినిమాలో ఇంకా మంచి స్టఫ్ ఉంది. క్లైమాక్స్ ఫైట్‌ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో తీశాం. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా సాయిదుర్గా తేజ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నారు.
సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ…
నేను మండుటెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ప్రయాణం మొదలు పెట్టిన తరుణంలో ఈ సినిమా నాకు చెప్పులు దొరికినట్లు దొరికిన అద్భుత అవకాశం. మణీంద్రన్ గారు నన్ను చాలా నమ్మారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయలేదని భావిస్తున్నాను. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సంగీతానికి మంచి స్కోప్ ఉండేలా దర్శకుడు కథను రాసుకోవడం నాకు బాగా ప్లస్ అయ్యింది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు.
దర్శకుడు మణీంద్రన్ మాట్లాడుతూ…
ముందుగా నేను చెప్పిన బడ్జెట్‌కన్నా ఎక్కువ అవుతున్నా.. నా వర్క్ చూసిన నిర్మాత లివింగ్‌స్టన్ గారు ఎక్కడా అడ్డు చెప్పకుండా సహకరించిన విధానం హేట్సాఫ్. అలాగే హీరో గారు కూడా బాగా సహకరించారు. అందుకే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. ప్రతి టెక్నీషియన్ నేను ఏది ఆశిస్తున్నానో.. అంతకుమించి అవుట్‌పుట్ ఇచ్చారు. ఆర్టిస్ట్‌లు కూడా చక్కటి సహకారం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి గారితో నాకు 10 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన సంగీతం ఈ సినిమాకు హైలైట్. డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కుని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుణ్ణి డబ్బుకు మించిన ఆనందాన్ని ఇచ్చే సినిమా ఇది.
హీరో సంజయ్‌రావు మాట్లాడుతూ…
ఇది నాకు 3వ సినిమా. ప్రతి టెక్నీషియన్ వారి బెస్ట్ అవుట్‌పుట్ 100 శాతం ఇచ్చారు. అలాగే ఆర్టిస్ట్‌లు కూడా. సంగీత దర్శకుడు గౌర హరిగారు నన్ను కలిసి వినిపించిన తొలి ట్యూన్‌తోనే ఆయన్నే పెట్టుకోవాల్సిందిగా నేను రికమెండ్ చేశాను. దర్శకుడు మణీంద్రన్ నాకు మంచి మిత్రుడు కూడా. అలాగే నిర్మాత లివింగ్‌స్టన్ గారు కూడా అంతే. వీరిద్దరి వల్లే నా జీవితభాగస్వామిని కలవడం జరిగింది. లింగ్‌స్టన్ గారు అనుకున్న దానికన్నా బడ్జెట్‌ను భారీగానే పెంచుకుంటూ వస్తున్నారు. కేవలం సినిమా వస్తున్న క్వాలిటీ విధానం ఆయనకు నచ్చే ఇలా జరిగింది. ఇది నాకు మంచి టర్నింగ్‌పాయింట్ ఇచ్చే సినిమా. అన్ని వర్గాలను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. టీం అందరికీ సూపర్ సక్సెస్ ఇచ్చే సినిమా ఇది అన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ సభ్యులు ఈ సినిమా ఘన విజయం సాధించి తమకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రసంగించారు.
ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: శ్రీకాంత్ గేదెల, ఎడిటర్: తలారి సాయిబాబు, మాటలు: వై. సురేష్ కుమార్, ఆర్ట్: నాగు Ê కల్యాణ్, ఫైట్స్ : శంకర్, మేకప్: వెంకట్, సీజీ: చందు ఆది Ê టీం, కాస్ట్యూమ్స్: శ్రీ గణేష్, డాన్స్: ప్రశాంత్ మాస్టర్, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి, నిర్మాత: లివింగ్‌స్టన్, రచన, దర్శకత్వం: మణీంద్రన్.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…