జూలై 26న రిలీజ్ కానున్న ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’

సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ఈ సినిమాని డా. ఆరవేటి యశోవర్ధాన్ గారు ‘ఏ బి డి ప్రొడక్షన్స్’ బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 26 నా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ “గల్లీ గ్యాంగ్ స్టార్స్ అనేది ఒక సినిమా కాదు నిజ జీవితంలో ఎందరో అనాధలు ఎదురుకునే రోజువారి సంఘటనలు. అనాధల బాధ్యత సమాజం తీసుకోకపోతే ఆ సమాజం ఎన్ని దారుణాలు ఎదురుకోవలసి వస్తుందో వాస్తవికంగా తెరక్కించటం జరిగింది. సినిమా షూటింగ్ అంతా నెల్లూరులో 76 రోజుల పాటు షూటింగ్ చెయ్యటం జరిగింది. ఎన్నో సార్లు అనుకున్న బడ్జెట్ దాటిపోయి షూటింగ్ ఆగిపోతుంది అనుకున్న ప్రతిసారి ప్రొడ్యూసర్ యశోవర్ధాన్ గారు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యటం వల్లనే ఈ సినిమా ఈరోజు రిలీజ్ కాబోతుంది.

చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఎనలేని మక్కువ కలిగిన యశోవర్ధాన్ గారు సినిమా నిర్మాణం వైపు అడుగులు వేసి ‘ఏ బి డి ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ని నిర్మించి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తూ వరసగా మూడు సినిమాలు నిర్మించారు. దానిలో మొదటి సినిమా ప్రయోగాత్మకమైన చిత్రం “May 16” ఇది ఒక మోనో డ్రామా. ఆ తర్వాత చిత్రం నెల్లూరు గల్లిలో జరిగే మాస్ డ్రామా సినిమా “గల్లీ గ్యాంగ్ స్టార్స్” .

ఈ సినిమా ఈ నెల 26 నా రిలీజ్ కానుంది. ఇదే బ్యానర్ లో వస్తున్న మరో సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఒక పక్క డాక్టర్ గా తన బాధ్యతలని ఇంకో పక్క తనకి ఎంతో ఇష్టమైన సినిమాలని రెండిటిని బాలన్స్ చేస్తున్నారు. ABD ప్రొడక్షన్స్‌తో, మరెన్నో గొప్ప చిత్రాలకు తన సహకారం అందించాలని మరియు సినీ చరిత్రలో తనకంటూ కొంత గుర్తింపు సంపాదించాలని ఆశిస్తున్నాను చిన్న సినిమా ఐనప్పటికీ ఇందులో పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. తప్పక అందరిని అలరిస్తుంది అని నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరు ధియేటర్ కి వచ్చి మా చిన్న సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నటీనటులు :
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి

టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్
నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్
స్టొరీ మరియు దర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు, ధర్మ
డి ఓ పి- ఎడిటర్- రచయత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ
సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి
పి ఆర్ ఓ: మధు VR

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

20 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

20 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

20 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago