ఘనంగా డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ “నిరమ్” ట్రైలర్, ఆడియో లాంఛ్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “నిరమ్”. ఈ చిత్రాన్ని కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్ పై కె. బిందుమాధవి నిర్మిస్తున్నారు. పి.రాజేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దర్శకుడు బలరామ్ కృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “నిరమ్” సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

లిరిసిస్ట్ భారతీబాబు మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను రెండు సాంగ్స్ రాశాను. వనమాలి గారు రెండు సాంగ్స్ రాశారు. డైరెక్టర్ బలరామ్ కృష్ణ గారికి తెలుగు బాగా తెలుసు. ఆయన మాతో మంచి సాంగ్స్ రాయించుకున్నారు. మనిషి రంగులు ఎలా మారుస్తాడు అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా డైరెక్టర్ రూపొందించారు. తెలుగులో ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డీవోపీ సంటానియో టెర్జియో మాట్లాడుతూ – బలరామ్ కృష్ణ అద్భుతమైన దర్శకుడు. దర్శకుడిగా ఆయనకు తొలి చిత్రమైనా స్క్రీన్ ప్లే, విజువల్ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటారు. ఇదొక మంచి సినిమా. ఈ చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉంది. డీప్ ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇమ్మాన్ మ్యూజిక్ మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన మ్యూజిక్ కథలోని ఎమోషన్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముగెన్, ప్రీతి, తాన్యా పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

సింగర్ ప్రవస్తి మాట్లాడుతూ – ఇమ్మాన్ సార్ నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కంపోజిషన్ లో పాట పాడాలనేది నా డ్రీమ్. ఈ చిత్రంతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ మూవీ మీ అందరినీ ఎంగేజ్ చేస్తుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ మాట్లాడుతూ – క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, హారర్..ఇవి నా ఫేవరేట్ జానర్స్. నేను కెరీర్ లో ఇప్పటిదాకా 120కి పైగా చిత్రాలకు మ్యూజిక్ చేశాను. అయితే నేను కంపోజ్ చేసిన రెండో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి. భారతీబాబు, వనమాలి మంచి సాహిత్యాన్ని అందించారు. “నిరమ్” చిత్రాన్ని థియేటర్స్ లో చూసేందుకు వేచి చూస్తున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ పి. రాజేష్ మాట్లాడుతూ – నేను, డైరెక్టర్ బలరామ్ కృష్ణ స్కూల్ ఫ్రెండ్స్. మా కె స్క్వేర్ వెంచర్స్ సంస్థకు ఇది తొలి చిత్రం. మేము ఈ సినిమా నుంచి సినిమా పరిశ్రమలో మా ప్రయాణం కొనసాగించాలని అనుకుంటున్నాం. మేము కొత్త వాళ్లమైనా మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ గారు వెల్ కమ్ చేశారు. మాతో వర్క్ చేసేందుకు ముందుకొచ్చారు. మా టీమ్ అంతా పూర్తి సహకారం అందించారు. డైరెక్టర్ బలరామ్ ఒక సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ను మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. అన్నారు.

నటుడు నితిన్ సత్యా మాట్లాడుతూ – నా కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాను. ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాను. మా చిత్రానికి మంచి పేరొస్తే ఆ క్రెడిట్ డైరెక్టర్ కు, మ్యూజిక్ డైరెక్టర్ కే ఇవ్వాలి. మా టీమ్ అంతా కలిసి ఒక మంచి సినిమా చేశాం. తమిళంతో పాటు తెలుగులోనూ మా సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి సురేఖా వాణి మాట్లాడుతూ – ఈ చిత్రంలో నాకు చాలా మంచి క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. నితిన్ సత్యాతో కలిసి నా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఆయనతో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ సినిమాను మీరంతా నాకోసమైనా హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ బలరామ్ కృష్ణ మాట్లాడుతూ – నాకు దర్శకుడిగా తొలి చిత్రమిది. ఈ స్క్రిప్ట్ ను ఇమ్మాన్ గారికి, ఇతర టెక్నీషియన్స్ కు ఆర్టిస్టులు ముగెన్, ప్రీతి, తాన్యాకు చెప్పినప్పుడు వాళ్లు స్క్రిప్ట్ చాలా బాగుందని చెప్పడం నాకు కాన్ఫిడెన్స్ పెంచింది. అనేక వెర్షన్స్ స్క్రిప్ట్ రాసి సరి చూసుకుని స్టోరీ బోర్డ్ తో ఈ సినిమా తెరకెక్కించాం. సాంగ్స్ కోసం ఇమ్మాన్ గారు కావాల్సినంత టైమ్ తీసుకుని క్వాలిటీగా మ్యూజిక్ ఇచ్చారు. ఒక టీమ్ వర్క్ గా మేమంతా ఈ సినిమాకు వర్క్ చేశాం. సినిమా సెట్స్ మీదకు వెళ్లేముందే అంతా పర్పెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ లోనే బాగా డిస్కషన్స్ చేశాం. అందుకే షూటింగ్ ప్రాసెస్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. మీరు కొత్త వాళ్లను ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటారు. మీకు మా మూవీ నచ్చితే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి.

హీరోయిన్ తాన్యా హోప్ మాట్లాడుతూ – మా నిరమ్ మూవీ టీమ్ తో కలిసి మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. మా సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మీరంతా మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. నా క్యారెక్టర్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక సాధారణ యువతి తనకు తెలియకుండా ఒక పెద్ద సమస్యలో చిక్కుకుపోతే ఎలా ఇబ్బంది పడుతుంది, ఆ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది అనేది నా పాత్రలో చూస్తారు. ఇంట్రెస్టింగ్ గా వెళ్లే కథలో నేనూ ఒక భాగంగా కనిపిస్తా. ఈ టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. నేను ఏ సినిమా చేసినా ఆ మూవీ టీమ్ ఎలా ఉంది అని చూస్తాను. అన్నారు.

హీరో ముగెన్ రావ్ మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. ట్రైలర్ లాగే సినిమా కూడా మీ అందరినీ ఎంగేజ్ చేస్తుంది. తెలుగు ఆడియెన్స్ మా సినిమా చూసి ఆదరించాలని మేమంతా కోరుకుంటున్నా. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. ఒక డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా మా నిరమ్ మూవీ మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అన్నారు,

నటీనటులు – ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్, నితిన్ సత్యా, సురేఖా వాణి, శ్రీజిత రవి, అన్బు మయిల్ సమి, తిరునవుకరసు, గజరాజ్, స్నేహా గుప్త, తదితరులు

టెక్నీషియన్స్

డైరెక్టర్ – బలరామ్ కృష్ణ
ప్రొడ్యూసర్ – కె. బిందుమాధవి
కో ప్రొడ్యూసర్ – పి. రాజేష్
మ్యూజిక్ డైరెక్టర్ – డి.ఇమ్మాన్
డీవోపీ – సంటానియో టెర్జియో
ఎడిటర్ – సబూ జోసెఫ్
లిరిక్స్ – వివేక, పా.విజయ్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)

TFJA

Recent Posts

‘కాళాంకి భైరవుడు’నుంచి ‘ఏంటో ఏమో’ పాట విజయవాడలో ఘనంగా విడుదల

విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ…

1 hour ago

ఎం.ఎస్. రాజు మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‘అగధ’ ట్రైలర్ ఆగస్టు 3న విడుదల!

ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.…

7 hours ago

హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) థ్రిల్లర్ మూవీ “ది మేజ్” నుంచి ఫస్ట్ సింగిల్ ‘నన్నే నన్నే..’రిలీజ్

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…

1 day ago

జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️ తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల…

1 day ago

నేడు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…

2 days ago

*వెర్స‌టైల్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్…

2 days ago