“యంగ్ అండ్ డైనమిక్”, “మా రాముడు అందరివాడు” వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “రామభద్రుడు” ఈ రోజు ఘనంగా షూటింగ్ ప్రారంభించుకుంది. “రామభద్రుడు” “రామభద్రుడు” శ్రీరామ్ హీరోగా నటిస్తున్న 13వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి మహేష్ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుర్గా వరప్రసాద్ నిర్మిస్తుండగా సుందర్ రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గోల్డ్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టీస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా తనదైన శైలిలో సినిమా రంగంలో దూసుకుపోతున్న శ్రీరామ్ ను అభినందించారు. “రామభద్రుడు” సినిమా ఘన విజయం సాధించి శ్రీరామ్ కు హీరోగా గొప్ప పేరు తీసుకురావాలని వారు శుభాకాంక్షలు తెలిపారు.
డైనమిక్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – హీరోగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ అందరి ఆదరణతో, ప్రేమతో ఈ రోజు మా “రామభద్రుడు” సినిమా షూటింగ్ ప్రారంభించుకున్నాం. మా మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టీస్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న మంచి కథతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. పేరున్న నటీనటులు, ప్రతిభ గల సాంకేతిక నిపుణులు మా సినిమాకు వర్క్ చేస్తున్నారు. మంచి కంటెంట్ తో వచ్చే ఫిబ్రవరిలో మా “రామభద్రుడు” సినిమాను రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.
నటీనటులు – తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గోల్డ్ రెడ్డి, లక్ష్మణరావు, క్రాంతి, జబర్దస్త్ అప్పారావు, తదితరులు
ప్రొడక్షన్ మేనేజర్ – రాహుల్ యాదవ
కో డైరెక్టర్స్ – రవీందర్ రెడ్డి
అసిస్టెంట్ డైరెక్టర్ – మనోహర్
మ్యూజిక్ – బొల్లా వెంకటేష్
కో ప్రొడ్యూసర్ – సుందర్ రాజ్
ప్రొడ్యూసర్ – దుర్గా వరప్రసాద్
డైరెక్టర్ -మహేష్ భాగ్యరాజ్
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…
'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి…
లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్' వరిష్ స్టూడియోస్…
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో…
హైదరాబాద్ నగర వాసులకు రుచితో పాటు సరికొత్త వాతావరణంలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గ్రాండ్ ఓపెనింగ్…
‘ప్రేమ్ కీటను’ సినిమాతో నటిగా పరిచయమైన ఆఫియా సయ్యద్, ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.…