టాలీవుడ్

పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం !!!

పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం !!!

అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం జి.పి.ఎల్. అల్లు లత ప్రేసెన్స్ తో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి.

పవన్ శంకర్, యాని, తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

లవ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ మరియు వైజాగ్, కోడై కెనాల్ లో జరగనుంది. నవంబర్ 14 నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

డైరెక్టర్ రావు జి.ఎం.నాయుడు మాట్లాడుతూ…
పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుంది… మనం ఏదైనా పైన ఉన్న భగవంతుడి ఆదేశాల మేరకు నడుస్తాము అనే పాయింట్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోందని తెలిపారు.

నిర్మాత అల్లు సాయి లక్ష్మణ్ మాట్లాడుతూ…
జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. లవ్, సస్పెన్స్ తో కూడిన ఈ సినిమా షూటింగ్ సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నాము, మాకు సహకరిస్తున్న మీడియా వారందరికీ ప్రేత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు

నటీనటులు:
పవన్ శంకర్, యాని, తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు

టెక్నీషియన్స్:
బ్యానర్: అల్లు ఆర్ట్స్
నిర్మాత: అల్లు సాయి లక్ష్మణ్
దర్శకత్వం: రావు జి.ఎమ్ నాయుడు
కెమెరామెన్: రామ్ కంద
సంగీతం: మణిశర్మ
చీఫ్ అసోసియేట్: శివ వేములవాడ

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

4 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago