బెస్ట్ ప్రొడ్యూసర్‌గా ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్’ అందుకున్న గౌరీ కృష్ణ
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీ నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఘనంగా జరిగింది. ఆర్వీ రమణ మూర్తి, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, మురళి మోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి విజేతలకు అవార్డులను అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో ‘మా ఊరి పొలిమేర2’ చిత్రానికి గాను బెస్ట్ ప్రొడ్యూసర్‌గా స్పెషల్ జ్యూరీ అవార్డును నిర్మాత గౌరీ కృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ ‘బెస్ట్ ప్రొడ్యూసర్‌గా ఇంతటీ ప్రెస్టీజీయస్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా సత్యం రాజేష్ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సక్సెస్‌లో భాగమైన నటీనటులు టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్’ అని చెప్పారు.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…