‘కథ వెనుక కథ’కి ఓటీటీలో మంచి స్పందన

వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్ని రకాల కుటుంబ ప్రేక్షకులు ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో విడుదలైన డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.


ప్రముఖ హాస్యనటుడు సునీల్, యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య… వైవిధ్యమైన వివిధ రకాల కథ… కథనాలతో ప్రేక్షకుల్ని అనుక్షణ థ్రిల్ కు గురిచేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ఔరా అనిపిస్తుంది. దర్శకుడు అయ్యి… తన మేనమామ కూతురుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే హీరో విశ్వంత్… ఓ అప్ కమింగ్ డైరెక్టర్ నిజజీవితంలో సినిమా ఛాన్సుల కోసం ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటారో… అలాంటి హార్డిల్స్ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. అందుకు తగ్గట్టుగానే విశ్వంత్ నటన ఇందులో ఉంటుంది. ఆలీ, సత్యం రాజేష్, ఛత్రపతి శేఖర్… ఇలా ఇందులో నటించిన వారంతా తమ శక్తిమేరకు నటించి మెప్పించారనే చెప్పొచ్చు.

అలాంటి సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు నిర్మాత అవనీంద్రకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణ విలువలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని… అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న మా సినిమాని ఆడియన్స్ అంతలా ఆదరిస్తున్నారన్నారు. ఇది మాకు ఎంతో బూస్టప్ నిచ్చిందన్నారు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడటం వల్లే సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందని… వారందరికీ కృతజ్ఞతలు అన్నారు.

Tfja Team

Recent Posts

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన…

19 hours ago

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

19 hours ago

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం నుంచి ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…

20 hours ago

ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ‌ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ క‌ల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…

23 hours ago

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…

1 day ago

‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…

1 day ago