గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్

Must Read

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం తాజా గాసెన్సార్ పూర్తి చేసుకుందిసెన్సార్ బోర్డ్ ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి యూఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

‘గాడ్ ఫాదర్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. థార్ మార్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా

నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్

సమర్పణ: కొణిదెల సురేఖ

బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్

సంగీతం: ఎస్ ఎస్ థమన్

డీవోపీ: నీరవ్ షా

ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News