టాలీవుడ్

ప్రేమ ట్విస్టులతో “అమ్మాయిలు అర్థంకారు”

“1940లో ఒక గ్రామం”,”‘కమలతో నా ప్రయాణం”, “జాతీయ రహదారి” వంటి అవార్డు సినిమాల దర్శకుడునరసింహ నంది తెరకెక్కిస్తున్న తాజా సినిమా “అమ్మాయిలు అర్థంకారు”. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య. ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు.


శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాతలు నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.


.అతిధులగా పాల్గొన్న సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “నరసింహ నంది తన అభిరుచికి అనుగుణంగా సినిమాలను తీసుకుని పోతున్నారు. అయితే డబ్బు తెచ్చిపెట్టే కమర్షియల్ సినిమాలను ఆయన రూపొందించి ఉంటే, ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరి ఉండేవారు. ఆ కోవలో ఈ సినిమా ఆయనకు పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను” అని అన్నారు. .


టి.ప్రసన్నకుమార్, బసిరెడ్డి మాట్లాడుతూ,”డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది. కానీ తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే ఆలోచన పరిశ్రమలో అందరికీ కలగాలి. నరసింహ నంది తన తొలి సినిమాతోనే జాతీయ అవార్డు సాధించారు. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని అవార్డు సినిమాలను తీశారు. అలాంటి దర్శకులను ప్రోత్సహించాల్చిన అవసరం ఎంతైనా ఉంది” అని అన్నారు.


దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, సమకాలీన వాస్తవిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని మధ్యతరగతి జీవితాలలో జరిగే నాలుగు ప్రేమ జంట కథలతో ఈ సినిమాను తెరకెక్కించాను. మధ్య తరగతి జీవితాలలో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుంది, దానివల్ల జీవితాలు ఎలా తారుమారు అవుతాయో అన్న అంశాన్ని ఇందులో చర్చించాం. ఓ రచయిత అన్నట్లు మహాభారతంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో…అలాగే మధ్యతరగతి జీవితాలలో అన్ని ట్విస్టులు ఉంటాయన్న కోణంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈషే అబ్బూరి ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంటుంది” అని అన్నారు.


నిర్మాతలలో ఒకరైన కర్ర వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, “చిత్తూరు, తిరుపతి ప్రాంతాల యాసను నేపధ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది” అని చెప్పారు.

హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ, చిత్తూరు యాసను కస్టపడి నేర్చుకుని మరీ ఈ సినిమాలో నటించామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు బాలాదిత్య, వి.ఎన్.ఆదిత్య, వీరశంకర్ తదితరులు పాల్గొని, ప్రసంగించారు.

ఈ సినిమాలోని ఇతర పాత్రలలో కొలకలూరి రవిబాబు, మురళి (ప్రజాశక్తి), గగన్, వీరభద్రం, శంకర్ మహంతి, మల్లేష్, మండల విజయభాస్కర్, జబర్దస్త్ ఫణి తదితరులు తారాగణం. సాంకేతిక బృందం: ఛాయాగ్రహణం: ఈషే అబ్బూరి, సంగీతం: నరసింహ నంది, నేఫధ్య సంగీతం: రోణి ఆడమ్స్, పాటలు: మౌన శ్రీ మల్లిక్, కమల్ విహస్, ప్రణవం, సహ నిర్మాతలు: అల్లం వెంకటరావు చౌదరి, షేక్ రహమ్ తుల్లా, నిర్మాతలు: నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య, రచన, దర్శకత్వం: నరసింహ నంది.

Tfja Team

Share
Published by
Tfja Team
Tags: "'kamalatō nā prayāṇaṁ""1940lō oka grāmaṁ''"jātīya rahadāri" vaṇṭi avārḍu sinimāla darśakuḍu narasinha nandi terakekkistunna tājā sinimā"am'māyilu arthaṅkāru". Allaṁ śrīkānt000 Translation results Translation result A Village in 19401940Lō oka grāmaṁallaṁ śrīkāntAllam Srikantham'māyilu arthaṅkāruAmmailu Panthakarudarśakuḍu narasinha nandiDirector Narasimha NandiGaganjabardast phaṇiJabardast Phanijātīya rahadārikamalkamalatō nā prayāṇaṁKarra Venkata Subbaiahkarra veṅkaṭa subbayyakolakalūri ravibābuKolakaluri RavibabumallēṣMalleshMandal Vijayabhaskarmaṇḍala vijayabhāskarMeeravalimīrāvalimīrāvali hīrōlugāmuraḷi (prajāśakti)Murali (Prajashakti)My Journey with Lotusnandireḍḍi vijayalakṣmireḍḍiNandireddy VijayalakshmireddyNational Highwaynirmāta mēḍikoṇḍa veṅkaṭa muraḷīkr̥ṣṇapraśāntPrashanthPriyankapriyāṅkaProducer Medikonda Venkata MuralikrishnaSaidivyaśaṅkar mahantisāyidivyasāyidivya. PriyāṅkaSenior Director Tammareddy BharadwajaShankar MahantyShravanisīniyar darśakanirmāta tam'māreḍḍi bharadvājaśrāvaṇiśrāvaṇi hīrōyinlugā naṭin̄cāru. Prēma ṭvisṭulatō"am'māyilu arthaṅkāru" Show more 839 / 5Sri Lakshmi Narasimha Cinemaśrī lakṣmī narasinha sinimāsvātiSwathiTelugu Film Chamber President Basireddytelugu nirmātala maṇḍali pradhāna kāryadarśi prasannakumārtelugu philiṁ chāmbar presiḍeṇṭ basireḍḍiTelugu Producers Council General Secretary Prasanna KumarVeerbhadramvīrabhadraṁ

Recent Posts

Star boy Siddhu Jonnalagadda, Bommarillu Baskar, and BVSN Prasad’s JACK team ropes in the talented Sam CS to compose the background score

Star boy Siddhu Jonnalagadda's upcoming film "Jack - Konchem Krack" directed by Bommarillu Bhaskar is…

4 days ago

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ - కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు.…

4 days ago

ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై…

1 week ago

Grand Paderu 12th Mile Teaser Launch Program !!!

Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati…

1 week ago

ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించిన మ్యాజికల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘టుక్‌ టుక్‌’

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీతో చిత్రీకరించిన 'ఏలా అల తీపికోరే పూలతోట' పాట విడుదల అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో నేటి మన…

1 week ago

For the First Time in Indian Cinema: AI-Generated Song Featured in the Film Tuk Tuk

The Indian film industry continues to embrace cutting-edge technology, with filmmakers increasingly integrating advanced visual…

1 week ago