ఐకానిక్ అకాడమీ అవార్డు విన్నర్ ఎం.ఎం. కీరవాణి-కవిపెరరసు వైరముత్తు-కె.టి కుంజుమోన్ కొలాబరేషన్ లో వరల్డ్ ఫేమస్ బోల్గట్టి ప్యాలెస్ ఐలాండ్‌లో కంపోజ్ సెషన్ తమిళ పరిశ్రమ మెగా ప్రొడ్యూసర్ కె.టీ కుంజుమోన్ నిర్మించనున్న జెంటిల్‌మన్ 2 కంపోజింగ్ బిగిన్స్
ప్రముఖ నిర్మాత “జెంటిల్‌మన్” కె.టి. కుంజుమోన్ అనేక బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషించారు. ‘జెంటిల్‌మన్” సినిమా ద్వారా దర్శకుడు శంకర్‌ని పరిచయం చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌ని క్రియేట్ చేశారు. 30 సంవత్సరాల తరువాత “జెంటిల్‌మన్ 2” పార్ట్ 2 ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఎ. గోకుల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అకాడమీ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కవిపేరరసు లిరిక్ రైటర్ వైరముత్తు సాహిత్యం అందిస్తుండగా అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ వర్క్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.
ప్రాజెక్ట్ మెటీరియలైజ్‌లో మొదటి దశగా, కె.టి. కుంజుమోన్ కొచ్చిలోని ప్రపంచ ప్రఖ్యాత బోల్గట్టి ప్యాలెస్ ఐలాండ్‌లో పాటల కంపోజింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు. ఎం.ఎం. కీరవాణి జూలై 19న కవిపేరరసు పాటల రచయిత వైరముత్తుతో కలిసి ఇక్కడికి చేరుకోనున్నారు.
ఈ ఇద్దరు దిగ్గజాలు కలసి గతంలో వరుస విజయాలు సాధించారు. కీరవాణి తమిళంలో చేసిన సేవగన్, వనమే ఎల్లై, జాతి మల్లి చిత్రాలలో అనేక విజయవంతమైన పాటలని అందించారు. దర్శకుడు గోకుల్ కృష్ణ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఈ జీనియస్ బృందంలో చేరుతున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత కె.టి.కుంజుమోన్ అత్యంత భారీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది గురించిన వివరాలు త్వరలో తెలియజేస్తారు.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…