ఘనంగా పూజా కార్యక్రమాలతో ‘గాంగేయ’ మూవీ ప్రారంభం

ఎం విజయ శేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద టి. హేమ కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం గాంగేయ. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు సముద్ర క్లాప్ కొట్టగా.. సమర్పకులు ఎం విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

అనంతరం చిత్ర దర్శకుడు బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ.. రామానాయుడు గారిలా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాను నిర్మిస్తున్నాం. దేశ జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా.. కుల మత బేధాలు లేకుండా మనిషి మనిషిని ప్రేమిస్తేనే శాంతి చేకూరుతుందనే పాయింట్ మీద సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఐదు భాషల్లో నిర్మిస్తున్నామ’ అని అన్నారు.

నిర్మాత టి. హేమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గాంగేయ సినిమాను నేడు ప్రారంభించాం. అందరి సహకారంతో త్వరగా సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాం. నేడు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థాంక్స్’ అని అన్నారు. ఎం విజయ్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘చాలా మంచి కథతో ఈ సినిమా రాబోతోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో గగన్ విహారి మాట్లాడుతూ.. ‘అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా ఇది. దైవ భక్తి, దేశ భక్తి, ప్రేమ కథ ఇలా అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మంచి సినిమాను తీయాలని మా నిర్మాతలు ఎంతో కష్టపడుతున్నారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి’ అని అన్నారు.

హీరోయిన్ అవ్యుక్త మాట్లాడుతూ.. ‘తెలుగులో నాకు ఇది మొదటి చిత్రం. ఈ సినిమా కథ, స్క్రిప్ట్ ఎంతో బాగుంది’ అని అన్నారు.

గగన్ విహారి, అవ్యుక్త, టీ. హేమ కుమార్ రెడ్డి, సీనియర్ నటుడు సుమన్ గారు, ఎం విజయ శేఖర్ రెడ్డి, ది జంక్, రణధీర్, అలోక్ జైన్, హీరా మాధురి, జయవాణి, జోహర్, చంద్ర శేఖర్, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఖదీర్, దాసన్న తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సాంకేతిక బృందం
బ్యానర్ : విజయ గౌతమి ఆర్ట్స్ మూవీస్
నిర్మాత : టీ. హేమ కుమార్ రెడ్డి
సమర్ఫణ : ఎం. విజయ శేఖర్ రెడ్డి
దర్శకత్వం : బి. రామచంద్ర శ్రీనివాస కుమార్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం : ర్యాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రఫీ : అడుసుమిల్లి విజయ్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : వాసు
పీఆర్వో : సాయి సతీష్‌

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago