‘ప్రణయ గోదారి’ నుంచి మాస్ బీట్ ‘గు గు గ్గు..’ని రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

ప్రస్తుతం ఫీల్ గుడ్ స్టోరీస్, చిన్న చిత్రాలు, కొత్త టీం చేస్తున్న ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, యాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.

ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు. గు గు గ్గు.. అంటూ సాగే ఈ హుషారైన పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. భార్గవి పిల్లై గాత్రం కుర్రకారుని కట్టి పడేసేలా ఉంది.

పాటను రిలీజ్ చేసిన అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి సినిమాలోని గు గు గ్గు… అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాను. పాట చాలా బాగుంది. హుక్ స్టెప్స్ బాగున్నాయి. ఈ మూవీని అందరూ ఆదరించాలి. విఘ్నేశ్ గారు తెరకెక్కించిన ప్రణయ గోదావరి పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

నటీనటులు : సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ : పీఎల్వీ క్రియేషన్స్
నిర్మాత :పారమళ్ళ లింగయ్య
దర్శకుడు :పి.ఎల్.విఘ్నేష్
సంగీతం:మార్కండేయ
కెమెరా:ఈదర ప్రసాద్
చీఫ్ కోడైరెక్టర్:జగదీష్ పిల్లి
డిజైనింగ్:టీఎస్ఎస్ కుమార్
అసిస్టెంట్ డైరెక్టర్:గంట శ్రీనివాస్
కొరియోగ్రాఫీ:కళాధర్,మోహనకృష్ణ,రజిని
ఎడిటర్:కొడగంటి వీక్షిత వేణు
ఆర్ట్:విజయకృష్ణ
కాస్ట్యింగ్ డైరెక్టర్:వంశీ ఎమ్.

Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

8 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago