గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చేశారు. సెప్టెంబర్ 28న సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. పల్లవిలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ నుంచి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీ నుంచి పక్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అలరించబోతుందని అర్థమవుతుంది. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు.
ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ సరికొత్త ఎనర్జీనిచ్చింది. వినయ విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చరణ్, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజర్‌లో అలరించటానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సందడిని సిల్వర్ స్క్రీన్‌పై చూడాలనే ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తోంది. ఇయర్ ఎండింగ్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది గేమ్ ఛేంజర్ యూనిట్ లో.
లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను అబ్బురపరిచే రీతిలో తెరకెక్కించే శంకర్ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్ ఛేంజర్’ను రూపొందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.
నటీ నటులు:
రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శంకర్, నిర్మాణ సంస్థలు: శ‌్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, రైటర్స్: ఎస్.యు.వెంకటేశన్, వివేక్, స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్, కో ప్రొడ్యూసర్: హర్షిత్, సినిమాటోగ్రఫీ:ఎస్.తిరుణావుక్కరసు, మ్యూజిక్: తమన్.ఎస్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, లైన్ ప్రొడ్యూసర్స్: నరసింహారావ్.ఎన్, ఎస్.కె.జబీర్, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్: అన్బరివు
డాన్స్ కొరియోగ్రాఫర్స్: ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ, లిరిసిస్ట్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, ఎడిటర్: షామీర్ ముహ్మద్, సౌండ్ డిజనర్: టి.ఉదయ్‌కుమార్, పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…