సక్సెస్ ఫుల్, డైనామిక్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో చాలా సామాజిక సేవ చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు.గత రెండు బ్లాక్‌బస్టర్‌లతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. యాదృచ్ఛికంగా.. తిమ్మాపూర్ కేబినెట్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి జన్మస్థలం. అభిషేక్ అగర్వాల్- మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం వుంది.
వివిధ ఈవెంట్‌లు , ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు.తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు.చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్ అక్టోబర్ 30న శ్రీ జి. కిషన్ రెడ్డి సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమంకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదిక కానుంది.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…