నేటి కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీన పడుతోంది. అందుకు కారణం మనుషుల మధ్య ఎమోషన్స్ లేకపోవటమే.. భావోద్వేగాలే బంధాలను కలకాలం నిలుపుతాయి. రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ ఇంకెంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సునిశితమైన అంశాన్ని హృద్యంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తాతినేని సత్య. ఈయన దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దీన్ని రూపొందిస్తున్నారు.
భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్రయత్నమే సతీలీలావతి చిత్రం. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.
నటీనటులు : లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్స్: దుర్గాదేవి పిక్చర్స్
నిర్మాత: నాగమోహన్
దర్శకత్వం: తాతినేని సత్య
సంగీతం: మిక్కీ జె.మేయర్
సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్
మాటలు: ఉదయ్ పొట్టిపాడు
ఆర్ట్: కోసనం విఠల్
ఎడిటర్: సతీష్ సూర్య
పి.ఆర్.ఒ: మోహన్ తుమ్మల
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…