మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్ ,సాయికుమార్ , నటరాజ్ వరుణ్ సందేశ్ ,వితికా షేరు, ప్రధాన పాత్రధారులుగా జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ధర్మస్థల నియోజకవర్గం. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ “మా చిత్రం ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్ సుమన్ లతోపాటు యంగ్ హీరోస్ కూడా నటించారు. మంచి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. చంద్ర బోస్ గారు అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. చంద్రబోస్ గారు అందించిన లిరిక్స్ కు సునీత గారు వినసొంపైన వాయిస్ ఇచ్చారు. అన్ని హంగుల్తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం . తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది” అని అన్నారు .

సాయికుమార్ ,సుమన్ , నటరాజ,వరుణ్ సందేశ్, వితికా షేరు ,రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్ ,పృథ్వి, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి లిరిక్స్ :చంద్రబోస్, సింగర్ :సునీత, డి ఓ పి: వెంకట హనుమ, ఫైట్స్: నందు మాస్టర్ ,కొరియోగ్రఫీ: శ్రేష్టి వర్మ, డైలాగ్స్ :అస్లాం ,ఎడిటింగ్: సాయిబాబు తలారి, ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల , పి ఆర్ ఓ: బి. వీరబాబు, నిర్మాత: మేరుo భాస్కర్, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట.

