‘రైటర్ పద్మభూషణ్‌’ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్’ లో చిత్ర యూనిట్

Must Read

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో  చిత్ర యూనిట్  ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

సుహాస్ మాట్లాడుతూ..  ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ప్రిమియర్స్ చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్ రిలీజ్ ఇది. సినిమా చూసిన చాలా మంది నన్ను దీవిస్తుంటే అనందంతో నాకు మాట రాలేదు.  రేపటి కోసం ఎదురుచూస్తున్నాను. మా సినిమాతో పాటు వస్తున్న అన్ని సినిమాలు విజయాలు సాధించాలి’’ అన్నారు.

శరత్ మాట్లాడుతూ..   ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని పేరు పెట్టాం. సినిమా విడుదల వుంది. కానీ మాకు ఒత్తిడి లేదు. మేము సక్సెస్ కొట్టేసినట్లు ఫీలౌతున్నాం. గత ఆరు రోజులు గా..  విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్  కి టీం అంతా వెళ్లి అక్కడ కొందరితో కలిసి వాళ్ళన్ని థియేటర్ లోకి తెచ్చాం.  ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి థియేటర్లో అందరూ గట్టిగా నవ్వడం మర్చిపోలేని అనుభూతి. చాలా అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.  ఒక పెద్ద స్టార్ కి వుండే రెస్పాన్స్ మా మొదటి సినిమాకి వుండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  వర్డ్ అఫ్ మౌత్ ని నమ్ముకొని వెళ్తున్నాం. మీకు సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించాం. మల్టీ ప్లెక్స్ లో 150( జీఎస్టీతో కలుపుకొని). తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక , యుఎస్ , కెనడా, ఆస్ట్రేలియా లో విడుదలౌతుంది. మా సినిమాతో పాటు వస్తున్న సందీప్ కిషన్ గారి మైఖేల్, నాగ వంశీ గారి సినిమా.. అన్నీ సినిమాలు మంచి విజయాలు సాధించాలి. ’’ అని కోరారు

షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్  ప్రిమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని నమ్మకంగా పేరు పెట్టాం . మా నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రేక్షకులు రియాక్షన్ చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇదే నమ్మకాన్ని విడుదల తర్వాత ప్రేక్షకులు ఇస్తారని నమ్ముతున్నాను.  

టీనా శిల్పరాజ్ మాట్లాడుతూ..  ఇది నా మొదటి సినిమా. ప్రేక్షకుల ఆదరణ, స్పందన చూసినపుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలో భాగం కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

గౌరీ మాట్లాడుతూ..  ప్రిమియర్స్ కి వచ్చిన స్పందన చూస్తే నాకు ఆనందం మాట రాలేదు. చాలా  గొప్పగా ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడాలి’’ అని కోరారు.

చంద్రు మనోహర్  మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరు స్క్రీన్స్ అయ్యాయి. అద్భుతమైన స్పందన వచ్చింది.  లహరి మ్యూజిక్ 35 ఏళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీ లో వుంది. తొలిసారి ఈ చిత్రంతో ప్రొడక్షన్ చేయడం ఆనందంగా వుంది.  ఆల్రెడీ విజయం సాధించిన ఆనందం వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.

కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ… ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది . మీ అందరి సపోర్ట్ కావాలి.’’ అన్నారు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News