సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను ఆరాధిస్తుంటారు. సినిమాలో వాళ్ల నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో వాళ్ల మనసు, మంచితనం కూడా దీనిపై ఆధారపడి వుంటుంది. ఇలా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు కేవలం అభిమానులే కాదు ఆర్మీతో పాటు ఆయనన విపరీతంగా ఆరాధించే వాళ్లు కూడా వున్నారు. అందుకు అల్లు అర్జున్ అభిమానులతో ఎంతో ప్రేమగా వుండటమే కారణం. ఇక పుష్ప-2 చిత్రంతో భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయి ఆయనకు అభిమానులుగా మారారు.
పుష్ప చిత్రంతో తగ్గేదెలే అంటూ ఆయన మేనరిజం స్వాగ్‌కు అందరూ పడిపోయారు. ఇలా అల్లు అర్జున్‌ను అమితంగా ఇష్టపడే ఓ ఉత్తరప్రదేశ్ అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ నుండి ఐకాన్‌స్టార్‌ను కలవడానికి సైకిల్‌పై 1600 కిలోమీటర్లు ప్రయాణించి అల్లు అర్జున్‌ను చేరుకున్నాడు. తన అభిమాన హీరోని కలిసిన అతను కాసేపు ఆయనతో చిట్ చాట్ చేశాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో అల్లు అర్జున్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం చూడొచ్చు. తమ అభిమాన హీరోని కలిసిన ఆ అభిమాని ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిది. అల్లు అర్జున్ తన నిజమైన హీరోగా అభివర్ణించడం, అల్లు అర్జున్‌ను కలవడం తన జీవితంలో మరుపురాని అనుభూతిగా ఆ అభిమాని వర్ణించాడు. అంతేకాదు సైక్లింగ్ మొదలుపెట్టే ముందు చాలా సార్లు హనుమాన్ చాలిసా చదివానని ఈ సందర్భంగా ఆ అభిమాని తెలిపాడు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…