అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా పై కృష్ణ

చిత్రం అక్టోబర్‌28 నుండి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసి ఆ సినిమా గురించి తప్పనిసరిగా మాట్లాడాలి అనుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కృష్ణ మాట్లాడుతూ– నరేశ్, అలీలు హీరోలుగా వచ్చిన ‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’ చిత్రాన్ని నిన్నరాత్రి చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో నాకెంతో నచ్చిన చిత్రం ఈ సినిమా. దర్శకుడు శ్రీపురం కిరణ్‌ ఒక మలయాళ సినిమాని తీసుకుని తెలుగు ప్రేక్షకులకు ఎలా నచ్చుతుందో అలా మార్పులు, చేర్పులు చేసి తీశారు. ఈ సినిమాలోని నరేశ్‌ పాత్ర ఎంతో కీలకం, ఆ పాత్ర చేయటం చాలా కష్టం. మాటల్లేని మూగవాడి పాత్రలో నరేశ్‌ నిజంగా జీవించాడనే చెప్పాలి. నరేశ్‌ నటునిగా ఎంతో పరిణితి చెందాడు అనిపించింది. నరేశ్‌ భార్యగా చేసిన పవిత్రలోకేశ్‌ పాత్ర కూడా ఎంతో హోమ్‌లీగా చూడటానికి అందంగా బావుంది.

అలీ ఈ సినిమాలో ఎంతోచక్కగా నటించటంతో, డాన్స్‌లు కూడా చేశాడు. అలీ హీరోగా నటించిన ‘యమలీల’ సినిమాలో నేను డాన్స్‌ చేసిన ‘‘జుంబారో జజ్జుంబరో…’’పాట ఇప్పటికి నా అభిమానులకు ఎంతో ఇష్టమైన పాట. ఈ సినిమాద్వారా ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థను స్థాపించి ఇంతమంచి సినిమా తీయటం ఆనందం అనిపించింది. ఇకముందుకూడా అలీ మంచి సినిమాలు తీస్తాడని అనుకుంటున్నా అన్నారు. తర్వాత అలీని శాలువాతో సత్కరించి బోకేను అందచేశారు కృష్ణ. అనంతరం అలీ మాట్లాడుతూ– నా జీవితాన్ని మార్చిన ‘‘యమలీల’’ చిత్రంలో సూపర్‌హిట్‌ సాంగ్‌లో నటించి నాకు ఎంతో గొప్ప జీవితాన్ని ఇచ్చారు కృష్ణగారు.

కృష్ణగారి చేత్తో క్లాప్‌ కొట్టారంటే ఆ సినిమా వందరోజులే అని ఇండస్ట్రీలో టాక్‌ ఉండేది. ఆయన మంచిచేత్తో ‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’ సినిమా ప్రమోషన్‌ను ఏడాది క్రితం కృష్ణగారితోనే ప్రారంభించాను. ఆయన మనసు, చెయ్యి రెండు బంగారమే. అందుకే ఆహాలో విడుదలైన మా సినిమాకు ప్రేక్షకులనుండి, ఎన్నో ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. నరేశ్‌గారు షూటింగ్‌లో ఉండటంతో ఆయన రాలేకపోయారు. ఈ సినిమాలోని మా ఇద్దరి నటన, దర్శకుడు కిరణ్‌ టాలెంట్‌ కృష్ణగారికి నచ్చటం మా అదృష్టంగా బావిస్తున్నా’’ అన్నారు. దర్శకుడు కిరణ్‌ మాట్లాడుతూ–‘‘ ఆయన సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని. నా దర్శకత్వంలో వచ్చిన సినిమాని ఆయన మెచ్చుకోవటం అంటే నాకు అంతకు మించిన పెద్ద అవార్డు ఏమి లేదనే చెప్పాలి’’ అన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago