రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా పతాకంపై ఐ.భరత్ నిర్మించారు. ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి మౌత్ టాక్‌తో, క్రిటిక్స్ అభినందనలతో ముందుకు సాగుతున్న ఈ చిత్రం థ్యాంక్స్ మీట్ శనివారం జరిగింది. ఈసందర్భంగా
నిర్మాత భరత్ మాట్లాడుతూ ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసిన నా స్నేహితులకు, నా ఫ్యామిలీకి థ్యాంక్స్. రాహుల్ మాచినేని అనే సూపర్ కెమెరామెన్ ఈ సినిమాకు దొరికారు. ఆయన ప్రతిభ సినిమాలో కనిపించింది. సంగీత దర్శకుడు ప్రశాంత్‌కు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. విస్కి వల్లే ఈ రోజు సినిమాకు ఈ రోజు ఇంత మంచి టాక్ వచ్చింది. కామన్ ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తోంది. సింక్ సౌండ్ అనేది సినిమా విజయంలో ఎంత కీలకంగా అనిపించింది.ఈ సినిమాలో నటించిన నటీనటులు కొత్తవారైనా బాగా నటించారు. రవికృష్ణ, రాజీవ్ కనకాల నటన గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా అంటే, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇష్టంతో, నిజాయితీగా సినిమా చేశాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండ
దర్శకుడు విస్కి మాట్లాడుతూ ‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మా నటీనటులదే. చిన్నసినిమా గురించి ఎవరూ మాట్లాడుకోరు. కానీ మా సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. మీరు మౌత్‌టాక్ తెలుసుకుని సినిమాకు వెళ్లండి. సినిమా థియేటర్స్ తిరిగి స్పందన తెలుసుకుంటున్నాం. అందరూ చాలా బాగా తీశారు అని మెచ్చుకుంటున్నారు. నేను నా వాస్తవ జీవితంలో జరిగిన ఈ సంఘటనను థియేటర్‌లో ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలనే వుద్దేశంతో సినిమాను చాలా సహజంగా తీశాను. ఇదొక కాన్సెప్ట్ ఫిలిం. ఇది అందరికి రీచ్ అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నిజాయితీగా ఈ సినిమా తీశాను. సొంతంగా విడుదల చేశాం. మీరు సినిమా చూసి నచ్చితే నలుగురికి చెప్పండి.
ఎటువంటి నేపథ్యం లేకుండా అందరం కొత్తవాళ్లం కలిసి ప్రయత్నించాం. ఆడియన్స్ ఆదరిస్తున్నారు. తప్పకుండా సినిమా చూడాని వాళ్లు చూసి మమ్ములను ఎంకరేజ్ చేయండి అని చిత్ర నటీనటులు తెలిపారు.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…