సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 28) నాడు సెకండ్ సింగిల్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో..
విశాల్ మాట్లాడుతూ .. ‘‘మకుటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నందుకు ఆనందంగా ఉంది. ఈ సారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను. ‘శివ’ చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. ఈరోజు ఆర్‌బీ చౌదరి గారిని నేను మిస్ అవుతున్నాను. 99వ ప్రాజెక్ట్ బాధ్యతల్ని ఆయన నాకు ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీకి దర్శకుడిగా మారాను. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నాను. ఆయన బ్యానర్ నుంచి పరిచయం అయిన దర్శకుల్లో నేను 45వ వ్యక్తిని. సుబ్రహ్మణ్యం గారు నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే ‘మకుటం’ ఈ స్థాయి వరకు వచ్చింది. ఈ మూవీ కోసమే ఏడాదిపాటుగా నా పర్సనల్ విషయాల్ని పక్కన పెట్టాను. నాకు ఈ ప్రయాణంలో సాయి ధన్సిక ఎంతో అండగా నిలిచారు. ‘లింగా’ పాట మంచి హిట్ అయింది. అందులో నన్ను సింగర్‌గా చేయడం జీవీ ప్రకాష్ తీసుకున్న రిస్క్ (నవ్వుతూ). ‘నచ్చాకే వచ్చేరా’ పాటను ప్రభ అద్భుతంగా పాడింది. ఆమె పాడిన ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. నన్ను నమ్మి ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన తోటి ఆర్టిస్టులందరికీ థాంక్స్. నేను ఇంత వరకు పని చేసిన దర్శకులందరి టెక్నిక్స్‌ను ఇందులో వాడాను. ఈ సినిమా కోసం నా బెస్ట్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. మూవీ గురించి నేను ఎక్కువగా చెప్పను. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆడియెన్స్ మాట్లాడతారు. మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. ‘పందెంకోడి’ మూవీని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దర్శకుడిగా మీ ముందుకు రాబోతోన్నాను. నన్ను ప్రభావితం చేసిన అర్జున్ గారికి, ఆర్జీవీ గారికి థాంక్స్. గత 22 ఏళ్లలో 35 చిత్రాలు చేశాను. ఇంత వరకు నన్ను అభిమానించిన, ఆదరించిన ప్రేక్షకదేవుళ్లకు థాంక్స్. ‘మకుటం’ ఎలా ఉంది అనేది నేనే ఆడియెన్స్ వద్దకు వచ్చి తెలుసుకుంటాను. ‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాను’ అని అన్నారు.
అంజలి మాట్లాడుతూ .. ‘‘మదగదరాజా’ తరువాత విశాల్‌తో కలిసి ‘మకుటం’ చేశాను. అప్పుడు విశాల్ హీరో.. ఇప్పుడు దర్శకుడు కూడా. ఇందులో నేను ఓ మంచి, పవర్ ఫుల్ రోల్‌ను పోషించాను. విశాల్ నా పాత్రను గొప్పగా తీశాడు. విశాల్‌తో నాకు 15 ఏళ్ల బంధం ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకు ‘మకుటం’తో హీరోగా, దర్శకుడిగా పెద్ద విజయం దక్కాలి. ఈ మూవీ కోసం విశాల్ ఎంతో కష్టపడ్డారు. ఆయన పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను. ఆర్‌బీ చౌదరి బ్యానర్‌లోని 99వ సినిమాలో నేను హీరోయిన్‌గా నటించడం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఎప్పుడూ బాగుంటుంది. ఈ చిత్రంలోని ‘నచ్చాకే వచ్చేరా’ పాట నాకెంతో ఇష్టం. ఈ పాట పెద్ద హిట్ అవుతుంది. ‘మకుటం’ పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
జితన్ రమేష్ మాట్లాడుతూ.. ‘విశాల్ మాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. మా ఇంట్లో వ్యక్తిలా, సొంత అన్నలా ఉంటాడు. జీవీ ప్రకాష్ పట్టిందల్లా బంగారం అవుతుంది. మా ‘మకుటం’ మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. విశాల్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. అన్నీ తానై విశాల్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. 99వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ చిత్రం పెద్ద విజయం కానుంది. వందో ప్రాజెక్ట్ అనేది మా నాన్న గారికి ఎంతో స్పెషల్. ఆయన కోరికను మేం నెరవేర్చుతాం. వంద కాదు రెండొందల ప్రాజెక్టులు చేసి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తామ’ని అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ .. ‘విశాల్ గారితో 20 ఏళ్ల క్రితం ‘భయ్యా’ అని ఓ మూవీని చేశాను. మళ్లీ ఇప్పుడు ‘మకుటం’ చేస్తున్నాను. దర్శకుడిగా విశాల్ ఎలా చేస్తారా? అని అనుకున్నాను. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాను. ఆయన ఈ చిత్రంతో అద్భుతం క్రియేట్ చేయబోతోన్నారు’ అని అన్నారు.
నటి ఝాన్సీ మాట్లాడుతూ .. ‘‘నన్ను తమిళంలో పరిచయం చేస్తున్న విశాల్ గారికి థాంక్స్. సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. హీరోగా, దర్శకుడిగా అన్ని రకాలుగా విశాల్ ఈ చిత్రంతో అద్భుతం చేశారు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అంజలితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది మనందరి సినిమా. ‘మకుటం’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సింగర్ ప్రభ మాట్లాడుతూ .. ‘‘మకుటం’లో ఇంత మంచి పాటను పాడే అవకాశం ఇచ్చిన విశాల్ సర్‌కి, జీవీ ప్రకాష్ గారికి థాంక్స్. నేను ప్రైవేట్ ఆల్బమ్స్‌కి పాటలు పాడుతుంటాను. మొదటి సారిగా సినిమాకి పాడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
చిన్న చిత్రాలకు థియేటర్స్ లభించని పరిస్థితులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాగే చిన్న నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్…
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్,…
అక్టోబర్ 2న వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల తెలుగు సినీ ప్రియులు ఎంతగానో…
కర్ణాటక..చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి లో నివసించిన గాయత్రమ్మ ఆంజినప్పవాళ్ళ నిర్మాణంలో నవనారాయణ క్రియేషన్స్ బ్యానర్లో కాగితం పడవలు సినిమాను నిర్మించారు…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్…