రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుద

Must Read

దర్శకుడు డా. శైలేష్ కొలను, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సరికొత్త రొమాంటిక్ కామెడీ సినిమా కోసం చేతులు కలిపారు. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే అందమైన టైటిల్ ను ఖరారు చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను ఆవిష్కరించారు.

“ఏమో ఏమో ఇది” అనే టైటిల్ వినగానే ఉల్లాసమైన ప్రేమ భావనలు మనసులో మెదులుతున్నాయి. చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ తల్లి–కొడుకుల మధ్య సరదా సంభాషణతో ప్రారంభమవుతుంది. నవతరం ప్రేమ బంధాలు, ఆధునిక వివాహాలు వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించారు. గ్లింప్స్‌లో కథానాయిక తన ప్లేలిస్ట్‌లోని అలనాటి క్లాసిక్ పాటను ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. ఆ సన్నివేశం ద్వారా ఆమె లోతైన భావోద్వేగ అనుబంధాన్ని, ప్రేమను ఎంతో అందంగా ఆవిష్కరించారు.

బ్లాక్‌బస్టర్ ‘హిట్’ యూనివర్స్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు శైలేష్ కొలను, “ఏమో ఏమో ఇది” ద్వారా పూర్తిగా కొత్త జానర్‌లో అడుగుపెడుతున్నారు. ఇదే ఆయన తొలి రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇంతకుముందు తీవ్రత, యాక్షన్‌తో కూడిన ఉత్కంఠభరిత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను అందించిన ఆయన, ఇప్పుడు హృద్యమైన, హాయిగా సాగే, సరదాగా నవ్వించే సరికొత్త ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అభయ్ పాత్రలో రోషన్ మేకా నటిస్తున్నారు. తొలి చిత్రం ‘పెళ్లి సందడి’ ద్వారా ఆకట్టుకున్న ఆయన, ఇటీవల ‘ఛాంపియన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ ‘ఏమో ఏమో ఇది’ చిత్రంలో నేటి జెన్ జీ తరం ప్రేమను ఆవిష్కరించే పక్కింటి అబ్బాయి తరహా ఆకర్షణీయమైన పాత్రలో రోషన్ కనిపించనున్నారు.

అపూర్వ పాత్రలో ప్రీతి ముకుందన్ కనిపించనున్నారు. గ్లింప్స్‌లోనే ఆమె ఉత్సాహభరితమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అపూర్వ పాత్రలో సరికొత్తగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండటం అదనపు ఆకర్షణ. తన మధురమైన పాటలతో అనతికాలంలో గొప్ప సంగీత దర్శకుడిగా పేరుపొందిన ఆయన, తన అద్భుతమైన సంగీతంతో ఈ ప్రేమ ప్రపంచాన్ని మరింత అందంగా మలచనున్నారు. గ్లింప్స్ లోనే తనదైన నేపథ్య సంగీతంతో మాయ చేశారు. అలాగే ఛాయాగ్రాహకుడు వంశీ పచ్చిపులుసు అందించిన అందమైన, హాయిగా కనిపించే విజువల్స్‌.. ఆహ్లాదకరమైన ప్రేమ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి.

2026 ఆరంభంలో “అనగనగా ఒక రాజు”తో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.
2026 దసరా కానుకగా చిత్రo విడుదల అవుతుంది.

“ఏమో ఏమో ఇది” చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చిత్రం: ఏమో ఏమో ఇది
తారాగణం: రోషన్ మేకా, ప్రీతి ముకుందన్
దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News