టాలీవుడ్

‘దాస్ కా ధమ్కీ’ విశ్వక్ సేన్ కెరీర్ లో మైల్ స్టోన్: నివేదా

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్‌ గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ విలేఖరుల సమావేశంలో దాస్ కా ధమ్కీ’ విశేషాలని పంచుకున్నారు.

పాగల్ తర్వాత మళ్ళీ విశ్వక్ సేన్ తో పని చేయడం ఎలా అనిపిస్తోంది ?

‘పాగల్’ చేస్తున్నప్పుడే ‘ఓరి దేవుడా’ కి కాల్ వచ్చింది. కానీ ఆ పాత్ర నాకు సరిపోదని భావించాను. తర్వాత ధమ్కీ స్క్రిప్ట్ విన్నాను. చాలా నచ్చింది. చాలా యూనిక్ కథ. విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయడం మరింత స్పెషల్ గా మారింది.

ఇలాంటి పాత్రలో గతంలో కనిపించలేదు కదా ?

అవును. కెరీర్ లో మొదటిసారి ఇలాంటి పాత్ర చేశాను. డ్యాన్సులు చేయడం కొత్తగా అనిపించింది. చాలా గ్లామరస్ రోల్. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి.

పాగల్ విశ్వక్ హీరోగా చేశారు. కానీ ఇందులో హీరోతో పాటు దర్శకుడు నిర్మాతగా కూడా చేశారు కదా .. ఎలా అనిపించింది ?

హీరో నిర్మాతగా చేయడం వేరు. కానీ దర్శకత్వం ఒక ప్రధాన భాద్యత. హీరో, నిర్మాత దర్శకత్వం ఇలా మూడు భాద్యతలని తీసుకున్నారు విశ్వక్. నిర్మాతగా పూర్తి న్యాయం చేశారు. ఎప్పుడు ఏం కావాలన్నా సమకూర్చారు. ఇక దర్శకుడిగా అయితే విశ్వక్ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి తర్వాత అంత ఎనర్జీ వున్న దర్శకుడిని విశ్వక్ సేన్ లో చూశాను.

ఎన్టీఆర్ గారు విశ్వక్ ని దర్శకత్వం ఆపేయాయాలని అన్నారు కదా ? 

విశ్వక్ గొప్ప ఎనర్జీ వున్న దర్శకుడు. తన దగ్గర చాలా అద్భుతమైన పాయింట్స్ వున్నాయి. అయితే తానే నటుడిగా కాకుండా వేరే హీరోలని డైరెక్ట్ చేయాలని నా అభిప్రాయం. విశ్వక్ లో చాలా మాస్ వుంది. లోకేష్ కనకరాజ్ లాంటి టచ్ వుంది. బాలకృష్ణ గారు లాంటి పెద్ద మాస్ హీరోలని డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్ లో వుంది. తనకి గ్యాంగ్ స్టర్ సినిమాలంటే పిచ్చి. తను చాలా మంచి గ్యాంగ్ స్టర్ డైరెక్టర్ అవుతారు. తన దగ్గర చాలా మంచి కథలు వున్నాయి.

రావు రమేష్, రోహిణి గారితో పనిచేయడం ఎలా అనిపించింది  

 రావు రమేష్ గారు, రోహిణి గారు.. ఇందులో వున్నా అందరితో నాకు సీన్స్ వున్నాయి. అందరూ అద్భుతంగా చేశారు. రోహిణీ గారు అద్భుతమమైన నటి. కేవలం కళ్ళతోనే నటించగలదు. ఇందులో ఒక ఒక సీన్ వుంది. కేవలం వీల్ చైర్ లో కూర్చుని డైలాగ్ లేకుండా కూడా కన్నీళ్లు తెప్పించే సీన్ అది.

‘దాస్ కా ధమ్కీ’పై మీ అంచనాలు ఏమిటి ?

దాస్ కా ధమ్కీ’ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. విశ్వక్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. అలాగే దాస్ కా ధమ్కీ’ విశ్వక్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ గా నిలుస్తుంది.

niveda pethuraj

‘దాస్ కా ధమ్కీ’ బలాలు ఏమిటి ?

‘దాస్ కా ధమ్కీ’కి ప్రధాన బలం కథ. తర్వాత నటీనటులు. రావు రమేష్ గారు చాలా అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా ప్రధాన బలం. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా ?

వుంది కానీ ఇప్పుడే కాదు. నిర్మాణం మాత్రం చేసే ఆలోచన లేదు. (నవ్వుతూ) నటనతో పాటు బిజినెస్ పై కూడా ద్రుష్టి పెడుతున్నా. చెన్నయ్ లో రెస్టారెంట్ ఒకటి ప్రారంభించా.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?

సుస్మిత గారి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. హిందీ టీ సిరిస్ లో ఒక సినిమా చేస్తున్నా.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

16 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago