సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు యుఎఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందింది.
ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో విశేషమైన పాత్ర పోషించారు కార్తిక. కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి, యంగ్ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తికకు గోల్డెన్ వీసా అందజేశారు.
దుబాయ్‌లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందిన హమద్ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక తన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీక నాయర్ అన్నారు.
కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు. 1980ల్లో ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే! కేరళలోనూ ఉదయ్ సముద్ర గ్రూప్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక తెలిపారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…