సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 3న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘కృష్ణమ్మ’ మూవీ టీజర్, టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.. అనే లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా నుంచి ‘దుర్మమ్మ..’ అనే సెలబ్రేషన్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాలభైరవ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా సాకేత్ కొమండూరి పాడారు. నవరాత్రుల సమయంలో దుర్గమ్మ ముందు హీరో సంతోషంగా ఆడిపాడే సందర్భంలో ఈ పాట వస్తుందని అర్థమవుతుంది.
‘కృష్ణమ్మ’ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.
నటీనటులు:
సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ – కొరటాల శివ
బ్యానర్ – అరుణాచల క్రియేషన్స్
నిర్మాత – కృష్ణ కొమ్మలపాటి
రచన, దర్శకత్వం – వి.వి.గోపాలకృష్ణ
సంగీతం – కాల భైరవ
సినిమాటోగ్రఫీ – సన్నీ కూరపాటి
ఎడిటర్ – తమ్మిరాజు
ఆర్ట్ – రామ్ కుమార్
పాటలు – అనంత శ్రీరాం
ఫైట్స్ – పృథ్వీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవి సూర్నెడ్డి
పి.ఆర్.ఒ – వంశీ కాకా
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…