క్రిష్‌ చేతుల మీదుగా ‘ద్రోహి’ మూవీ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్‌ అన్నది ఉపశీర్షికజ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు.

ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ ‘‘సినిమాకు సంబంధించిన లుక్‌, గ్లింప్స్‌ చూశాను. చాలా ప్రామిసింగ్‌గా ఉంది. చక్కని తారాగణం ఈ చిత్రానికి పని చేశారు. ఈ సినిమాకు చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు తెచ్చుకుని సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నారు. టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు’’ అని అన్నారు.


దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘చక్కని థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు.

నటీనటులు
సందీప్‌ కుమార్ బొడ్డపాటి
దీప్తి వర్మ,
డెబి,
షకలక శంకర్‌,
నిరోజ్‌,
శివ,
మహేష్‌ విట్ట,
మెహ్బూబ్‌,
చాందినీ గొల్లపూడి తదితరులు.

సాంకేతిక నిపుణులు
కెమెరా: అశోక్‌ దబేరు,
ఎడిటర్‌: జానీ బాషా
సంగీతం: అనంత్‌ నారాయణ
డిఐ : రక్షిత్‌కుమార్‌ గజ్జల
లిరిక్స్‌ : నరేంద్రకుమార్‌
రచయిత: గణేష్
కో డైరెక్టర్ : రామ్ సాయి ముంగ
పీఆర్వో : మధు వి.ఆర్‌.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago