డాక్టర్ శివరాజ్ కుమార్ #ShivannaSCFC01 అనౌన్స్ మెంట్

డాక్టర్ శివరాజ్ కుమార్, కార్తీక్ అద్వైత్, సుధీర్ చంద్ర పదిరి #ShivannaSCFC01 అనౌన్స్ మెంట్

కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న తెలుగు నిర్మాతతో ఓ కొత్త చిత్రానికి సైన్ చేశారు. శివన్న పుట్టినరోజున సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఎస్‌సిఎఫ్‌సి (సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ) తొలి కన్నడ చిత్రంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి గతంలో విక్రమ్ ప్రభుతో ‘పాయుమ్ ఒలి నీ యెన’క్కు అనే తమిళ చిత్రాన్ని రూపొందించిన కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహించనున్నారు.

#శివన్నఎస్‌సిఎఫ్‌సి01 భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనుంది.  విక్రమ్ వేద, కైతి (తెలుగులో ఖైదీ) ఫేమ్ సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. డా. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇది హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా వుండబోతుందని సూచిస్తోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో శివన్నస్పోర్టింగ్ షేడ్స్ ధరించి టెర్రిఫిక్ గా కనిపించారు. ‘’Night has fallen let the killing begin!’’ అని పోస్టర్ పై రాయడం క్యురియాసిటీని పెంచుతోంది.

మేకర్స్ అన్ని దక్షిణాది భాషల నుండి ప్రముఖ నటీనటులని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పాన్ సౌత్ ఇండియా కన్నడ, తెలుగు, తమిళం , మలయాళ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: డాక్టర్ శివరాజ్ కుమార్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: కార్తీక్ అద్వైత్
నిర్మాతలు: సుధీర్ చంద్ర పదిరి
బ్యానర్: SCFC (సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ)
సంగీతం: సామ్ సిఎస్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago