‘డబుల్ ఇస్మార్ట్’- హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్ షూటింగ్

ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరి కనెక్ట్స్  క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’- హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్ షూటింగ్

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌ గా ‘డబుల్ ఇస్మార్ట్” తో తిరిగి వస్తున్నారు. ఈ కొత్త వెంచర్ గ్రిప్పింగ్ స్టోరీలైన్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఎక్సయిట్మెంట్, ఎంటర్టైన్మెంట్ ని న్యూ లెవల్ కి పెంచుతుందని ప్రామిస్ చేస్తోంది.

సంజయ్ దత్‌ విలన్ గా చేరడం వలన స్టార్ పవర్ లేయర్ ని యాడ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాస్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు, ఇది సినిమా విడుదలకు పెర్ఫెక్ట్ టైం. ఈరోజు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్కింగ్ చేస్తూ మేకర్స్ రామ్ పోతినేని స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తన ఊజ్స్ స్వాగ్ & స్టైల్ తో శంకర్ పాత్రకు ప్రాణం పోశారు రామ్ పోతినేని.

టైటిల్ సాంగ్ షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది, ఇది ప్రేక్షకులకు విజువల్, ఆడిటరీ ట్రీట్ ఉండేలా చూసేందుకు టీమ్ కేర్ తీసుకుంటుంది. పక్కా చార్ట్‌బస్టర్ అయ్యే ఈ పాటలో రామ్ పోతినేని సిగ్నేచర్ ఎనర్జిటిక్ స్టైల్‌లో ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూవ్‌లు, విజువల్స్‌ అద్భుతంగా ఉండబోతున్నాయి.

మణిశర్మ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో సాంగ్ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.  

రామ్ కు జోడిగా కావ్య థాపర్ నటిస్తోంది.  

ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించారు. సామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రాఫర్‌లు.

డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సిఈవో: విష్
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

20 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

20 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

20 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago