‘ డబుల్ ఇస్మార్ట్’ కీలక, లెన్తీ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని వారి బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ షూట్‌ను తిరిగి ప్రారంభించారు. 2024లో అత్యంత క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ సినిమా షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ లెన్తీ, కీలకమైన షెడ్యూల్‌లో మేకర్స్ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముంబైలో జరిగే ఈ తాజా షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌లో మేజర్ పార్ట్ పూర్తవుతుంది.

పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి సీక్వెల్‌తో టీమ్ రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్ టైన్మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రం కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ డబుల్ ఇస్మార్ట్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్ చేస్తున్నారు.

రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.

టెక్నికల్ గా హై స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

త్వరలోనే హ్యుజ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు రాబోతున్నారు మేకర్స్.

తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కెచ్చ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago