డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని వారి బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ షూట్‌ను తిరిగి ప్రారంభించారు. 2024లో అత్యంత క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ సినిమా షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ లెన్తీ, కీలకమైన షెడ్యూల్‌లో మేకర్స్ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముంబైలో జరిగే ఈ తాజా షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌లో మేజర్ పార్ట్ పూర్తవుతుంది.
పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి సీక్వెల్‌తో టీమ్ రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్ టైన్మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రం కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ డబుల్ ఇస్మార్ట్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్ చేస్తున్నారు.
రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.
టెక్నికల్ గా హై స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
త్వరలోనే హ్యుజ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు రాబోతున్నారు మేకర్స్.
తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కెచ్చ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…