దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది: హీరో సువిక్షిత్‌

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం హీరో సువిక్షిత్‌ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలివి.

నేపథ్యం ఏమిటి?
కడప జిల్లా రాయచోటి. నాకు వ్యాపారం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలంటే పాషన్‌.. సినిమాలను చూసి ఇన్‌స్పయిర్‌ అయ్యే వాడిని. అనుకోకుండా ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను.

ఈ సినిమాలోకి హీరోగా ఎలా అవకాశం వచ్చింది?
రచయిత నారాయణ గారు, అరుణాచలంలో కలిసిన ఓ యాచకుడి జీవిత గాథ ఆధారంగా ఈకథను అనుకుని రాసుకున్నారు. అయితే మొదట ఈ సినిమాను వేరే హీరోతో చేద్దామని ప్లాన్‌ చేశాం. అయితే కథకు కొత్త హీరో అవసరం కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్‌తో. ఆ పాత్రకు నేను సెట్‌ అవుతానని భావించి కథానాయకుడిగా నేనే నటించాను. ఇటీవల విడుదలైన టీజర్‌, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని అనుకుంటున్నాను.

మిమ్ములను మీరు ఈ కథ కోసం ఎలా మౌల్ట్‌ చేసుకున్నారు?
ఈ కథను నేను కూడా విన్నాను. 90 బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే ఈ కథలో లీడ్‌ పాత్రకు అప్పట్లో ఎలాంటి అనుభూతి పొందామో తెలుసుకుని నటించాలి. ఆ అనుభూతి పొందిన వారిలో నేను కూడా ఉన్నాను. అందుకే నేనే చేస్తే సహజంగా ఉంటుందని భావించాను. నేను ఈసినిమాలో ప్రత్యేకంగా నటించలేదు. జస్ట్‌ ఆ టైమ్‌లో ఎలా ఉండాలో అలా బిహేవ్‌ చేశాను.

రిలీజ్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారా?
మేము ఎదో తక్కువ థియేటర్స్‌లో రిలీజ్‌ చేద్దాం అనుకున్నాను. ఇప్పడు దాదాపుగా 250పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.

సినిమాలో హీరో , హీరోయిన్‌ చనిపోతారు అంటున్నారు? ఆ పాయింట్‌ను ఎందుకు రివీల్‌ చేశారు?
హీరో, హీరోయిన్ చనిపోయిన తరువాత హ్యపీ ఎండింగ్‌ ఎలా ఇచ్చాం. అసలు అరుణాచలంలోకి ఆ పెద్దాయన ఎలా వచ్చాడు? ఆయన జీవితంలో జరిగింది ఏమిటి అనేది కథ. సినిమాలో హీరో ఫాదర్‌గా ఆ పెద్దాయన పాత్ర కనిపిస్తుంది. 90లో ప్రతి ఒక్కరూ వాళ్ల ఊరిలో తిరిగొచ్చిన ఫీల్‌ కలుగుతుంది.

ఈ సినిమాలో హీరో పాత్రలో మీరే నటించడానికి కారణం ఏమిటి?
ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే. సహజత్వం కోసం కొత్తవాళ్లతో నటించాం. పేరున్న ఆర్టిస్టులు నటిస్తే పాత్రలు కనిపించవు. అతని పాపులారిటీ కనిపిస్తుంది. అందుకే నేచురాలిటి ఫీల్‌ కోసం కొత్తవాళ్లతో చేశాం.

ఈ సినిమా వర్కింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఏలా ఉంది?
ప్రతి సినిమాకు ఉండే కష్టాలు మాకు ఉన్నాయి. అయితే ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ అందరూ సపోర్ట్‌ చేశారు. కానీ ఈ రోజు సినిమాను విడుదల వరకు తీసుకరావడం మేము సాధించిన విజయంగా భావిస్తున్నాం. ఇక మంచి సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమాను క్వాలిటీ కోసం బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వటానికి టైమ్‌ తీసుకున్నాం.

యానాం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా నేచురల్‌గా లోకేషన్స్‌లో 90వ దశకం గుర్తొచ్చేలా సెట్‌లు వేసి ఈ సినిమా తీశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాదు.

90వ దశకం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడానికి రీజన్‌ ఏమిటి?
సిటీకి అలవాటు పడి అందరం మన మూలాలను, పల్లెట్లూర్లను మర్చిపోతున్నాం. అందుకే అందర్ని వెనక్కి తీసుకెళ్లి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తున్నాం. ఈ సినిమా చూసిన వారికి వాళ్ల సొంతూరు గుర్తుకొస్తుంది.

సినిమా టిక్కెట్‌తో పాటు కర్చీఫ్‌ ఇస్తామని అంటున్నారు?
ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషన్‌ చూసి ఎడ్వకుండా ఎవ్వరూ ఉండలేరు.

హీరోగా కంటిన్యూ చేస్తారా?
తప్పకుండా మంచి కథలతో సినిమాలు చేయాలని ఉంది.

TFJA

Recent Posts

ఘనంగా డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ “నిరమ్” ట్రైలర్, ఆడియో లాంఛ్

-త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో…

2 days ago

‘కాళాంకి భైరవుడు’నుంచి ‘ఏంటో ఏమో’ పాట విజయవాడలో ఘనంగా విడుదల

విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ…

2 days ago

ఎం.ఎస్. రాజు మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‘అగధ’ ట్రైలర్ ఆగస్టు 3న విడుదల!

ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.…

2 days ago

హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) థ్రిల్లర్ మూవీ “ది మేజ్” నుంచి ఫస్ట్ సింగిల్ ‘నన్నే నన్నే..’రిలీజ్

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…

3 days ago

జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️ తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల…

3 days ago

నేడు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…

4 days ago