“క” సినిమాకు గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెల్చుకున్న దర్శకద్వయం సందీప్, సుజీత్

కిరణ్ అబ్బవరం హీరోగా “క” చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని అందుకున్న దర్శకులు సందీప్, సుజీత్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో సందీప్, సుజీత్ లకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనౌన్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ దక్కడం ఈ దర్శకుల ప్రతిభకు లభించిన సరైన గౌరవంగా చెప్పుకోవచ్చు.

“క” మూవీ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తమ సంతోషాన్ని షేర్ చేసుకుంది. క” చిత్రంతో దర్శకులు సందీప్, సుజీత్ తమ ప్రయత్నంలోనే ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. గతేడాది దీపావళికి రిలీజైన “క” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. త్వరలో మరిన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు దర్శకులు సందీప్, సుజీత్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 day ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

1 day ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago