కిరణ్ అబ్బవరం హీరోగా “క” చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని అందుకున్న దర్శకులు సందీప్, సుజీత్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో సందీప్, సుజీత్ లకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనౌన్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ దక్కడం ఈ దర్శకుల ప్రతిభకు లభించిన సరైన గౌరవంగా చెప్పుకోవచ్చు.
“క” మూవీ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తమ సంతోషాన్ని షేర్ చేసుకుంది. క” చిత్రంతో దర్శకులు సందీప్, సుజీత్ తమ ప్రయత్నంలోనే ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. గతేడాది దీపావళికి రిలీజైన “క” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. త్వరలో మరిన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు దర్శకులు సందీప్, సుజీత్
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…