“బందూక్” చిత్ర దర్శకులు లక్ష్మణ్ మురారికి మాతృ వియోగం

Must Read

తెలంగాణలో మారుమూల ప్రాంతంలో రజాకార్లపై నాటకాలు వేసిన కీ.శే. మురారిశెట్టి పుల్లయ్య సతీమణి, ప్రముఖ యువ దర్శకులు “బందూక్ లక్ష్మణ్ అలియాస్ బందూక్ బాబి”గా చిత్ర పరిశ్రమ / రాజకీయ వర్గాలకు సుపరిచితులు అయిన మురారిశెట్టి లక్ష్మణ్ మాతృమూర్తి మురారిశెట్టి రాములమ్మ 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
విప్లవ భావాలు కలిగిన లక్ష్మణ్ మురారి తండ్రి వారసత్వంగా వచ్చిన నటన , నాటకరంగాల వారసత్వంతో సినీ రంగానికి వచ్చి రెండు దశాబ్దాలుగా ప్రొడ్యూసర్ గా “ఏకవీర, వేటాడు వెంటాడు, 143 హైద్రాబాద్, ఇందు” లాంటి చిత్రాలను నిర్మించి, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో బందూక్ చిత్రాన్ని దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకున్నారు.


9మంది సంతానానికి జన్మనిచ్చిన శ్రీమతి రాములమ్మది 5 తరాలను చూసిన ఘనత. ఒకే కుటుంబం లో వందకు పైగా సభ్యుల బాగోగులు చూసుకున్న తన తల్లి కానరాని లోకాలకు వెళ్ళడం తమ కుటుంబానికి తీరని లోటని లక్ష్మణ్ పేర్కొన్నారు.నల్గొండ జిల్లాలో పిల్ పాల్ పహాడ్ గ్రామంలో 1930 దశకంలో పుట్టిన అయిదుగురు ఆడ సంతానంలో జన్మించిన రాములమ్మ 6, 7 ఏళ్ల వయసులోనే బాల్య వివాహం చేసుకొని రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర గల మంచాల గ్రామంలోనే జీవితం కొనసాగించింది,
గంపెడు సంతానం, పూట గడవని జీవితంలోనూ… కన్న పిల్లలకు విద్య, బుద్దులతోపాటు, సమాజం పట్ల బాధ్యతని నేర్పారు. అమ్మగా, అమ్మమ్మగా, మునిఅమ్మగా, ముని అమ్మమ్మగా 5 తరాలకు ప్రతీక గా నిలిచిన రాములమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులతో పాటు, మంచాల గ్రామ పెద్దలు ఆకాంక్షించారు!!

Latest News

సురేష్ గోపి అనుపమ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

సూపర్ స్టార్ సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న...

More News