లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే

Must Read

  • యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే (DDLJ) 30 వ‌సంతాల సంద‌ర్బంగా లండ‌న్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో రాజ్‌, సిమ్రాన్ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన షారూఖ్ ఖాన్‌, కాజోల్‌.
  • లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే
  • ఆదిత్య చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయెంగే సినిమా ఎక్కువ కాలం థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శింపబ‌డ్డ చిత్రంలోని ఓ స‌న్నివేశాన్ని ప్ర‌తిబింబిస్తోన్న విగ్ర‌హం

బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కాజోల్ ఈరోజు లీసెస్టర్ స్క్వేర్‌లో కొత్త కంచు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఆదిత్య చోప్ర తెర‌కెక్కించి దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయెంగే సినిమా భార‌తీయ సినిమాల్లోనే అత్యంత ఆద‌ర‌ణ పొందిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రాజ్‌, సిమ్రాన్ పాత్ర‌ల‌ను పోషించినందుకు వారి పాత్ర‌ల‌కు ద‌క్కిన గౌర‌వ‌మది.

య‌ష్ రాజ్ ఫిల్మ్స్‌లో 30 సంత్స‌రాల‌ను పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలోని రాజ్‌, సిమ్రాన్ పాత్ర‌ల‌కు సంబంధించిన ఐకానిక్ స్టిల్‌ను కాంస్య విగ్ర‌హంగా రూపొందించారు. ఈ విగ్ర‌హం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ద‌క్షిణాసియాలో ఈ చిత్రానికి ఉన్న శాశ్వ‌త‌మైన పాప్ కల్చ‌ర్‌ను ప్ర‌భావితం చేసేలా సెల‌బ్రేట్ చేస్తోంది. లండ‌న్ లీసెస్ట‌ర్‌లో విగ్ర‌హ రూపంలో ఆవిష్క‌రింప‌బ‌డ్డ తొలి ఇండియ‌న్ సినిమా ఇదే. హ్యారీ పోట‌ర్‌, మేరి పాపిన్స్ ప్యాడింగ్ట‌న్‌, సింగింగ్ ఇన్ ది రెయిన్ వంటి చార్మిత్రాత్మ‌క చిత్రాల్లోని ప్ర‌ముఖ పాత్ర‌ల‌తో పాటు బ్యాట్ మ్యాన్‌, వండ‌ర్ ఉమెన్ వంటి వాటి స‌ర‌స‌న‌ ఇప్పుడీ విగ్ర‌హం ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది.

ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రసిద్ధ పాత్రలతో పాటు సీన్స్ ఇన్ ది స్క్వేర్ ట్ర‌యిల్‌లో ఈ విగ్రహం తన ప్ర‌త్యేక స్థానాన్ని పొందింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్‌స్టార్స్ షారూఖ్ ఖాన్‌తో పాటు కాజోల్, య‌ష్ రాజ్ ఫిల్మ్స్‌ సీఈఓ అక్షయే విదానీ, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాస్ మోర్గన్ హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా…

షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ‘‘DDLJ సినిమా స్వచ్ఛమైన మనసుతో ఎంత‌గానో ప్రేమించి రూపొందించాం. ప్రేమ గురించి, అది ఎలా మనుషుల మధ్య ఉన్న అడ్డంకులను తొలగిస్తుందో, ప్రేమ ఎక్కువగా ఉంటే ప్రపంచం ఎంత బావుంటుంద‌నే క‌థ‌ను దీంతో చెప్పాలనుకున్నాం. అందుకే DDLJ 30 ఏళ్లుగా ఇంతటి ప్రభావం చూపుతుందని భావిస్తున్నాను. వ్యక్తిగతంగా చూస్తే, DDLJ నా వ్యక్తిత్వంలోని ఒక భాగం. ఈ సినిమా రిలీజైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నేను, కాజోల్ ప్రేక్ష‌కుల నుంచి ప్రేమను ఇప్పటికీ పొందుతున్నాం. దాన్నెంతో గౌర‌వంగా భావిస్తున్నాం.

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలకు, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్‌కు DDLJ‌ను ఇలా సెలబ్రేట్ చేసి మాకు ఇలాంటి శాశ్వ‌త‌మైన గౌర‌వాన్ని ఇచ్చినందుకు నేను వారికి ప్ర‌త్యేక‌మైన కృతజ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాను. ఎంతో గొప్ప‌దైన సీన్స్ ఇన్ ది స్క్వేర్ ట్రైల్‌లో గౌరవం పొందిన తొలి భారతీయ సినిమా DDLJ కావడం చాలా ఎమోష‌న‌ల్ మూమెంట్‌. మాకు మా పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. ఈ సినిమాను ప్రపంచం ఇంతగా స్వీకరించిందే క్ష‌నాలు మాకెంతో గ‌ర్వంగా ఉంటుంది. ఈ క్షణాన్ని మొత్తం నటీనటులు, సాంకేతిక వర్గం, నా స్నేహితుడు, దర్శకుడు అదిత్య చోప్రా..య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ కుటుంబంతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నేనెప్పటికీ మరచిపోలేని క్ష‌ణం” అన్నారు.

కాజోల్ మాట్లాడుతూ ‘‘“దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే రిలీజైన 30 ఏళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమ‌ను పొందుతూ ఉండటం అద్భుతంగా ఉంది. లండన్‌లో విగ్రహం ఆవిష్కరించిన‌ దృశ్యాన్ని చూసినప్పుడు.. ఆ చారిత్రాత్మ‌క అనుభూతిని మ‌ళ్లీ పొందిన‌ట్లుగా అనిపించింది. ఇన్ని త‌రాలుగా అంద‌రితోనూ ట్రావెల్ అవుతోన్న క‌థ‌. ఎంతో ప్రాముఖ్యత ఉన్న లీసెస్టర్ స్క్వేర్‌లో విగ్రహం ఏర్పాటు చేసిన ఈ క్షణం మా ప్ర‌యాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినిమా కావడం, ప్రపంచంలోని DDLJ అభిమానుల హృదయాల్లో, మనసుల్లో ఎప్పటికీ నిలిచే అనుభూతి ఇది. మా సినిమాను ఇంతకాలం గుండెల్లో ఉంచుకున్న‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సంర్ద‌ర్భంగా నేను కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్నాను” అన్నారు.

DDLJ సినిమా రాజ్, సిమ్రన్‌ కథను చెబుతోంది. వారు ఇద్దరూ విదేశాల్లో నివసించే భారతీయులు. ప్రేమ‌లో ప‌డ్డ త‌ర్వాత వారి కలిసే ప్రయాణం కింగ్స్ క్రాస్ స్టేషన్ ట్రయిన్‌లో మొదలవుతుంది.

లీసెస్టర్ స్క్వేర్‌లో DDLJ విగ్రహం ఉండడం కరెక్ట్. ఎందుకంటే ఇందులో రాజ్, సిమ్రన్ ఒకరినొక‌రు ఎదురుప‌డే సన్నివేశంలో ఇక్క‌డే సంభ‌విస్తుంది. అయితే సినిమాలో అప్పుడు ఒక‌రినొక‌రు గుర్తించ‌రు. త‌ర్వాత యూరోపియన్ ప్రయాణానికి బయలు దేరుతారు. ఆ సన్నివేశంలో రాజ్ వ్యూ సినిమా ముందు, సిమ్రన్ ఓడియెన్ లీసెస్ట‌ర్ స్క్కేవ‌ర్ పక్కన నడుస్తూ క‌నిపించ‌టానికి మ‌న‌కు స్ప‌ష్టంగా చూపించారు.

1995లో విడుదలైన DDLJ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక ఫీవ‌ర్‌ను సృష్టించింది. ప్రపంచంలోని దక్షిణాసియన్ కమ్యూనిటీ కోసం ఒక ముఖ్యమైన సాంస్కృతిక చిహ్నంగా నిలిచింది. అందుక‌నే ఈ విగ్రహాన్ని సినిమా 30వ వార్షికోత్సవం సంద‌ర్భంగా ఏర్పాటు చేశారు. ఈ రోజుకి కూడా ఈ సినిమా భారతదేశంలో తన రికార్డు బ్రేక్ చేస్తూ ప్ర‌ద‌ర్శింప బ‌డుతోంది.

విడుదలయినప్పటి ఇప్ప‌టి వ‌ర‌కు DDLJ హిందీ సినిమా చరిత్రలో అత్యంత ఎక్కువకాలం ప్రదర్శితమైన సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా భారతదేశానికి చేసిన అధికారిక పర్యటనలో DDLJకు ప్రస్తావన ఇచ్చారు. UKలో కూడా ఈ సినిమాలోని వారసత్వం కొనసాగింది. ఈ ఏడాది ప్రారంభంలో మాంచెస్టర్‌లో క‌మ్ ఫాల్ ఇన్ ల‌వ్ – ది DDLJ మ్యూజిక‌ల్ అనే కొత్త స్టేజ్ అడాప్టేషన్‌లో ఇది ప్రదర్శించబడింది.

య‌ష్ రాజ్ ఫిల్మ్స్ సిఇఓ అక్ష‌యె విధాని మాట్లాడుతూ ‘‘50 ఏళ్లకు పైగా హృదయాన్ని హత్తుకునే భారతీయ కథలను ప్రపంచానికి చెప్పడంలో నిమగ్నమైన ఒక భారతీయ స్టూడియోగా యష్ రాజ్ ఫిల్మ్ అందరి హృద‌యాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ద‌క్కించుకుంది. DDLJ విడుద‌లైన 30 ఏళ్లైన సందర్భంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోఇలాంటి గౌరవం లభించడం అంద‌రూ గ‌ర్వించ‌ద‌గ్గ క్ష‌ణాలు. లీసెస్టర్ స్క్వేర్ వంటి చారిత్రాత్మక స్థలంలో శాశ్వతంగా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం మా సంస్థ‌కు ఇదెంతో గ‌ర్వించే క్షణం. మేరీ పాపిన్స్, జీన్ కెల్లీ, హ్యారీ పోట్టర్ వంటి హాలీవుడ్ ఐకాన్లతోపాటు గుర్తింపు పొందడం, UK సహా ప్రపంచవ్యాప్తంగా DDLJ చూపిన సాంస్కృతిక ప్రభావాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ గౌరవం మా సృజనాత్మక ప్రయాణాన్ని మరింత ముందుకు నడిపిస్తుంది, అలాగే మా అద్భుతమైన దేశం నుంచి సృజన్మాత‌, స్ఫూర్తిదాయ‌క‌మైన‌ కథలతో ప్రపంచంలోని ప్రజలను అల‌రించేలా మా ప్ర‌యాణం కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం’’ అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News