టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగానే ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ సినిమాను చేయబోతోంది. శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఖరారు కాలేదు. ఈ మూవీని హ బడ్జెట్‌తో పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్నారు.
మార్కోతో హనీఫ్ తనలోని మాస్, వయలెన్స్, యాక్షన్ యాంగిల్‌ను చూపించారు. ఇక ఇప్పుడు ఈయన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇక ఈ ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గురు ఫిల్మ్స్‌కు చెందిన సునీతా తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…