‘L2E: ఎంపురాన్’ థియేట్రికల్ ట్రైలర్…

ఖురేషి అబ్‌రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌, కంప్లీట్‌యాక్ట‌ర్‌ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ కాంబోలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’ థియేట్రికల్ ట్రైలర్…

  • మలయాళ సినీ హిస్ట‌రీలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో ట్రైల‌ర్ రిలీజ్‌..
  • ఐనాక్స్‌ మెగా ఫ్లెక్స్, ఇనార్బిట్ మాల్‌, మ‌లాడ్‌, ముంబైలో ‘L2E: ఎంపురాన్’ ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

మలయాళ సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పటినుంచి అభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాను చూడటానికి ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతూ L2E: ఎంపురాన్ ట్రైల‌ర్‌ను మార్చి 20 మ‌ధ్యాహ్నం గం1.08నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. పృథ్వీరాజ్ సుకుమార్ సృష్టించిన అద్భుత‌మైన ప్ర‌పంచాన్ని చూడ‌టానికి ప్రేక్ష‌కులు సిద్ధం కావ‌చ్చు. ఐనాక్స్‌ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్‌, మ‌లాడ్‌, ముంబై వేదిక‌లుగా మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లోనే కాదు, మలయాళ సినీ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ఐమ్యాక్స్ వెర్ష‌న్‌లో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తుండటం విశేషం

2019లో విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన లూసిఫ‌ర్‌కు ఇది సీక్వెల్‌. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమాకు చెందిన రెండో భాగ‌మే L2E: ఎంపురాన్. మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మ‌రోసారి మాస్ అవ‌తార్‌లో మెప్పించ‌బోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ’నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలను పోషించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ మూవీతో ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

మ‌ల‌యాళ చిత్రసీమ‌లోనే అత్యంత భారీ చిత్రంగా ‘L2E: ఎంపురాన్‌’ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ విడుద‌ల చేస్తోంది.

‘L2E: ఎంపురాన్‌’ చిత్రాన్ని మ‌ల‌యాళంతో పాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ విడుద‌ల చేస్తుండ‌గా హిందీలో అనీల్ త‌డానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. క‌ర్ణాట‌క‌లో ప్ర‌ముఖ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడులో గోకులం గోపాలన్ కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల. మ‌ల‌యాళ చిత్ర‌సీమ నుంచి ఐమ్యాక్స్‌లో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా ‘L2E: ఎంపురాన్‌’ ప్ర‌పంచ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుండ‌టం విశేషం.

ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌ట‌మే కాదు, మీడియాకు కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌త్యేక‌మైన షోను ప్ర‌ద‌ర్శించ‌నుండ‌టం విశేషం.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago