దిల్ రాజు చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘రెడ్డి మామ’ అంటూ సాగే మాస్ సాంగ్ విడుదల

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ‘రెడ్డి మామ’ అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు మెచ్చుకున్నారు. చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు.

త్వరలోనే రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.

నటీనటులు : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘనా ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ : సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్
నిర్మాతలు : గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్
డైరెక్టర్ : సంపత్ రుద్ర
స్క్రీన్ ప్లే : సంపత్ రుద్ర, ఎంఏ తిరుపతి
కథ : ఎంఏ తిరుపతి
డైలాగ్స్:రమేష్ రాయ్
డీవోపీ :వైఆర్ శేఖర్
మ్యూజిక్ : ఆర్ఆర్ ద్రువన్
ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి
పీఆర్ఓ : సాయి సతీష్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

3 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

3 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

3 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago