“ధూం ధాం” సినిమా నుంచి థర్డ్ సింగిల్ విడుదల

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“ధూం ధాం” సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’, ‘మాయా సుందరి..’ పాటలు పాట ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ రోజు థర్డ్ సింగిల్ ‘టమాటో బుగ్గల పిల్ల..’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీకృష్ణ, గీతా మాధురి ఆకట్టుకునేలా పాడారు. ‘ఎట్టెట్టగున్నా నువ్వు భల్లేగుంటావే…ఏ మాయో చేసి నన్ను గిల్లేస్తుంటావే..బంగారం గానీ తిన్నావా నువ్వు బబ్లీగా ముద్దొస్తుంటావే..బంగాళాఖాతం చెల్లెల్లా నన్ను అందంతో ముంచెస్తుంటావే..టమాటో బుగ్గల పిల్ల..’ అంటూ సాగుతుందీ పాట. కలర్ ఫుల్ డ్యూయెట్ గా ‘టమాటో బుగ్గల పిల్ల..’ పాటను రూపొందించారు.

నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్

డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా

Tfja Team

Recent Posts

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా మూవింగ్ డ్రీమ్స్ ఇండియా…

7 hours ago

“కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో ధీరజ్ న్యాతి ఆధ్వర్యం లో సురేష్ తేజ్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 మూవీ అనౌన్స్ మెంట్

"కె ర్యాంప్" వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్…

8 hours ago

కీరవాణి గారి లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి రానున్న మరొక సంచలన గీతం – ఈ నెల 28న విడుదల

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం…

8 hours ago

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా

హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’…

9 hours ago

కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతుల మీదగా మిస్సింగ్ మేఘన మూవీ టీజర్ లాంచ్*

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో…

10 hours ago

‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్‌లో దర్శకుడు రమణా రెడ్డి సోమ

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…

10 hours ago