టాలీవుడ్

“ధూం ధాం” పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో చేతన్ కృష్ణ

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో చేతన్ కృష్ణ.

  • నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి, గల్ఫ్ అనే మూవీస్ చేశాను. ఆ సినిమాల్లో కొన్నింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి గుర్తింపు వచ్చింది. నాకు గోపీ మోహన్ గారి స్క్రిప్ట్స్ ఇష్టం. సకుటుంబంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఆయన స్క్రిప్ట్స్ ఇస్తారు. అలాంటి మూవీ ఒకటి నేనూ చేయాలని అనుకున్నాను. ఇప్పటిదాకా విభిన్న తరహా చిత్రాల్లో నటించాను. ఒకసారి ఒక బిగ్ మూవీ చేద్దామని “ధూం ధాం” మొదలుపెట్టాం.
  • తండ్రీ కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఎక్కడిదాకా అయినా వెళ్తారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. దానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. మా మూవీలో ఫాదర్ తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్ గా ఉండాలనుకుంటాడు. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరిగా తయారవుతాడు. తన వల్ల ఒక అమ్మాయి జీవితంలో ఏర్పడిన సమస్యకు తనే పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తాడు.
  • మా మూవీలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారితో పాటు నటించడానికి బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. వాళ్ల టైమింగ్ తో మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించా. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ పట్టుకోవడం కష్టమైంది. ఆయన సినిమా సెకండాఫ్ లో వస్తారు. సినిమా మొత్తం ఉంటారు. ఈ సెకండాఫ్ మొత్తం పెళ్లి ఇంట సందడితో సాగుతుంది. ఇదే మా “ధూం ధాం” సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. సెకండాఫ్ లో థియేటర్ నిండా నవ్వులు నిండిపోతాయి. మొన్న వైజాగ్ లో ప్రీమియర్ వేసినప్పుడు కూడా సెకండాఫ్ లో నవ్వులు తప్ప మరే సౌండ్ థియేటర్ లో వినిపించలేదు.
  • అదుర్స్ లాంటి సినిమాల్లో హీరో ఒక ఫేమస్ కమెడియన్ పక్కనే ఉంటూ కథ సాగుతుంది. అలా “ధూం ధాం”లో కూడా నేను వెన్నెల కిషోర్ గారి పక్కనే ఉంటాను. మూవీ షూటింగ్ టైమ్ లో కిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సీన్స్ చేసే ముందు నాతో డిస్కస్ చేసేవారు. హెబ్బా పటేల్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను షూటింగ్ స్టార్ట్ కాక ముందు చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. కెమెరా రోల్ కాగానే తన క్యారెక్టర్ లోకి మారిపోతుంది.
  • నేను హీరోగా మంచి పొజిషన్ లో ఉండాలని నాన్న గారు కోరుకుంటారు. ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ప్రతి విషయంలో “ధూం ధాం” సినిమా ది బెస్ట్ గా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం మా సినిమాకు మరో అడ్వాంటేజ్. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. ఒక సెంటర్ లో ఒక మంచి థియేటర్ ఉంటుంది. ఏ సినిమా అయినా అక్కడే ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారు. అలాంటి ఒకట్రెండు థియేటర్స్ చిన్న డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు. ఆ విషయంపై నేను ప్రీ రిలీజ్ లో స్పందించాను. అయితే మాకు కావాల్సినన్ని మంచి థియేటర్స్ దొరికాయి.
  • ఇప్పుడు థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. నేనూ అదే చేస్తే వాటిలో మరొక థ్రిల్లర్ అవుతుంది. నేను గతంలో డిఫరెంట్ మూవీస్ చేసినప్పుడు అన్ని కమర్షియల్ ఫార్ములా మూవీస్ వచ్చాయి. ఇప్పుడున్న ట్రెండ్ కు భిన్నంగానే నేను “ధూం ధాం” చేశాను. తప్పకుండా ప్రేక్షకులు మా మూవీతో ఎంటర్ టైన్ అవుతారని, సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమా పూర్తయిన తర్వాత నా కొత్త మూవీ ప్లాన్ చేసుకుంటాను.
Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago