ధనుష్, సన్ పిక్చర్స్ ‘రాయన్’ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా రాయన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. 

‘అడవిలో బలమైన జంతువులు పులి, సింహాలే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులుమారిది. గుంపుగా చుట్టుముట్టి ఒక పధకం వేసి సింహన్ని ఓడిస్తాయి” అనే పవర్ ఫుల్ వాయిస్ ఇంట్రోతో మొదలైన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయింది. 

‘బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు. దహనం చేస్తాడు’ అంటూ ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇవ్వడం గూస్ బంప్స్ తెప్పించింది. ధనుస్ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ట్రైలర్ లో సందీప్ కిషన్ ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగా వుంది. ఎస్ జే SJ సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్ ఇంపార్ట్టెంట్ రోల్స్ లో కనిపించారు.

ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. ఓం ప్రకాష్ విజువల్స్,  ప్రసన్న జికె ఎడిటింగ్,  సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి.  పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.

జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago